భారతీయుడు-2.. ఇది కూడా పెద్ద సినిమానే

ఓ పెద్ద సినిమా థియేటర్లలోకి వస్తుందంటే, దాని రన్ టైమ్ మినిమం 3 గంటలుంటోంది. జనాలు దీనికి దాదాపు ఫిక్స్ అయిపోయారు. పెద్ద సినిమా వస్తుందంటే, 3 గంటల రన్ టైమ్ ఉండాల్సిందే అన్నట్టు మారింది పరిస్థితి. ఇప్పుడు భారతీయుడు-2 వంతు. బడ్జెట్ పరంగానే కాదు, నిడివి పరంగా కూడా ఇది పెద్ద సినిమాగా మారింది.

ఈ సినిమా కూడా పెద్దదే. డ్యూరేషన్ అక్షరాలా 3 గంటలు. తాజాగా సెన్సార్ పూర్తయింది. ఇది కేవలం సినిమా నిడివి మాత్రమే. క్రెడిట్స్, తప్పనిసరిగా ఉంచాల్సిన యాడ్స్ కలిపితే మరో 4 నిమిషాలు రన్ టైమ్ పెరుగుతుంది. ఇంటర్వెల్ బ్రేక్ తో కలిపితే థియేటర్ లో అటుఇటుగా 3 గంటల 20 నిమిషాలు గడపాల్సి ఉంటుంది.

ఈమధ్య కాలంలో వచ్చిన భారీ సినిమా యానిమల్. ఆ సినిమా నిడివి ఏకంగా 3 గంటల 20 నిమిషాలు. ఇక తాజాగా వచ్చిన సలార్, కల్కి సినిమాలు కూడా 3 గంటలకు పైగా ఉన్న సినిమాలే. ఇప్పుడీ లిస్ట్ లోకి భారతీయుడు-2 కూడా చేరింది.

టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్ద నిడివి సినిమాలు కొత్త కాదు. అర్జున్ రెడ్డి నుంచి మినిమం గ్యాప్ లో భారీ రన్ టైమ్ ఉన్న సినిమాలు వస్తూనే ఉన్నాయి. కాబట్టి నిడివి సమస్య కాదు. సినిమా బాగుంటే ప్రేక్షకుడు 3 గంటలైనా కూర్చుంటాడు. అలా కూర్చోబెట్టగలిగే సినిమానే హిట్. Readmore!

భారతీయుడు-2 సినిమా తెలుగు ప్రమోషన్స్ మరో 3 రోజుల్లో ప్రారంభం కాబోతున్నాయి. హీరో కమల్ హాసన్, దర్శకుడు శంకర్ హైదరాబాద్ వచ్చి 2 రోజుల పాటు ఇక్కడే ఉండబోతున్నారు. కాజల్, రకుల్, సిద్దార్థ్ వస్తున్నారా లేదా అనేది ఇంకా ఫిక్స్ కాలేదు. ముఖ్యమైన మీడియా ఛానెళ్లు (ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా)ను కలవబోతున్నారు. దీంతో పాటు ఓ చిన్న ఫంక్షన్ కూడా పెట్టే ఆలోచనలో ఉన్నారు.

Show comments

Related Stories :