సమయం చాలడం లేదు-కొరటాల

టాప్ డైరక్టర్ కొరటాల శివ వున్నట్లుండి ఒక బాంబ్ పేల్చారు. సోషల్ మీడియా నుంచి వైదొలగుతున్నా అంటూ ట్విట్టర్ లో ఓ నోట్ పోస్ట్ చేసారు. 

తనకు ఇక్కడ ఎన్నో జ్ఞాపకాలు వున్నాయని, ఇకపై కూడా ఏమైనా పంచుకోవాల్సిన విషయాలు వుంటే మీడియా ముఖంగా తెలియచేస్తా అని నోట్ లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో 'గ్రేట్ ఆంధ్ర' చిన్న చిట్ చాట్

సర్..నమస్తే.. 

నమస్తే అండీ Readmore!

ఏమిటీ? బాంబ్ పేల్చారు

బాంబ్ అంటే ఏమీ లేదు. ఎప్పటికైనా డిటాచ్ కావాల్సిందే కదా? అందుకే.

ఇంకా మీ తొమ్మిది సినిమాలు పూర్తి కాలేదు కదా

(నవ్వేస్తూ) ఏమో తొమ్మిది సినిమాలు చేస్తానో? మధ్యలోనే ఆగుతానో? 

మళ్లీ మరో బాంబు పేలుస్తున్నారు కదా...కీలకమైన టైమ్ లో ట్విట్టర్ ను వదిలేస్తే ఎలా?

కీలకమైన టైమ్ ఏముంది?

ఆచార్య విడుదల..ఎన్టీఆర్ సినిమా ప్రారంభం, ఆపై ఇంకా కొత్త ప్రాజెక్టులు

అన్నింటికీ మీరు, మీడియా వున్నారుగా. ఏమున్నా చెబుతాను. మీరే షేర్ చేస్తారు. జనాలకు అందిస్తారు.

ఈ డిటాచ్ మెంట్ కు అసలు రీజన్ లేదా?

రీజన్ అంటే సమయం సరిపోవడం లేదండీ. ఓ పక్క పోస్ట్ ప్రొడక్షన్, మరో పక్క ప్రీ ప్రొడక్షన్, ఇంకా సినిమాల వ్యవహారాలు వీటన్నింటి మధ్య సోషల్ మీడియాకు సమయం సరిపోవడం లేదు. వీటన్నింటి మధ్యలో పడి ఏదైనా మరిచిపోతాం. సరే, ఇవన్నీ ఎందుకు..ఎప్పటికైనా డిటాచ్ మెంట్ మొదలవ్వాలి కదా అని.

ఇంతకీ ఆచార్య ఎంత వరకు వచ్చింది.

అయిపోవచ్చిందంటీ, మరో 12 రోజులు షూట్ అయితే అయిపోయినట్లే. అది కాగానే మళ్లీ మరోసారి మీతో మాట్లాడతాను.

థాంక్యూ అండీ

థాంక్యూ

-విఎస్ఎన్ మూర్తి

Show comments

Related Stories :