హమ్మయ్య.. సెన్సార్ పూర్తయింది

కొన్ని సినిమాలు వస్తున్నాయని చెప్పినా  నమ్మలేని పరిస్థితి. విడుదల తేదీ ప్రకటించడం వాయిదా వేయడం వాటికి ఆనవాయితీ. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా వీటిలో ఒకటైతే, రెండో సినిమా లవ్ మీ. ఇప్పుడు మనం చెప్పుకునేది ఈ రెండో సినిమా గురించే.

ఆల్రెడీ ఒకసారి వాయిదా పడి, ఈ వీకెండ్ విడుదలకు సిద్ధమైన లవ్ మీ సినిమా వస్తుందంటే, ఇప్పటికీ నమ్మని వాళ్లు చాలామంది ఉన్నారు. ఓవైపు ప్రచారం చేస్తున్నప్పటికీ సినిమాపై కొంతమందికి అనుమానాలు అలానే ఉన్నాయి.

దీనికి కారణం మొన్నటివరకు ఈ సినిమా షూటింగ్ జరగడమే. అసలు ఫస్ట్ కాపీ రెడీ అయిందా లేదా అనే డౌట్స్ కూడా ఉన్నాయి చాలామందిలో. అయితే ఇకపై అలాంటి అనుమానాలు అక్కర్లేదు.

లవ్ మీ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అవ్వడమే కాదు, సెన్సార్ కూడా పూర్తయింది. సెన్సార్ జనాలు ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. సినిమా నిడివి 136 నిమిషాలుంది. ఈ జానర్ సినిమాకు ఇది పెర్ ఫెక్ట్ రన్ టైమ్. Readmore!

సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తవ్వడంతో లవ్ మీ సినిమాపై అనుమానాలు తొలిగాయి. ఇక ఈ సినిమా రిలీజ్ అవ్వడం పక్కా అని తేలిపోయింది. ఆశిష్, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. దెయ్యాన్ని హీరో ప్రేమిస్తే ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది అనే పాయింట్ ను ఇందులో చూపించారు. దీంతో పాటు బలమైన ఎమోషన్స్ ఉన్న సినిమా ఇది.

Show comments

Related Stories :