ఉత్తరాది ప్రేక్షకుల కోసం కొత్త ప్రభాస్ సిద్ధం

బాహుబలితో నార్త్ లో కూడా పాపులర్ అయ్యాడు ప్రభాస్. అయితే ప్రభాస్ లో ఇప్పటివరకు ఒక కోణం మాత్రమే అక్కడి ప్రేక్షకులు చూశారు. బాహుబలిలో ఉగ్రరూపం... సలార్, సాహో సినిమాల్లో యాక్షన్ లుక్ మాత్రమే చూశారు.

ఈసారి ఉత్తరాది ప్రేక్షకులు తనలో కామెడీ కోణం కూడా చూస్తారని చెబుతున్నాడు ప్రభాస్. తనకు కామెడీ కొత్త కాకపోయినా, నార్త్ ఆడియన్స్ మాత్రం తొలిసారి తనలోని ఫన్నీ యాంగిల్ ను చూస్తారని అంటున్నాడు.

"కల్కి సినిమాలోని నా పాత్రలో గ్రే షేడ్స్ ఉంటాయి. సూపర్ హీరో పాత్ర కూడా. దీనికితోడు కాస్త సరదాగా కూడా ఉంటుంది. బాహుబలికి ముందు నేను కొంచెం కామెడీ చేశాను. కానీ నార్త్ ఆడియన్స్ కు మాత్రం నాలో కామెడీ కోణం తెలియదు. అందుకే నా పాత్రను వాళ్లు చాలా కొత్తగా ఫీలు అవుతారు. ఫన్ క్యారెక్టర్ లో నన్ను వాళ్లు తొలిసారి చూడబోతున్నారు. దీంతో పాటు గ్రే షేడ్స్, సూపర్ హీరో షేడ్స్ కూడా ఉంటాయి."

కల్కి సినిమాలో భైరవ అనే పాత్ర పోషించాడు ప్రభాస్. తన కెరీర్ లోనే భైరవ పాత్రను ది బెస్ట్ క్యారెక్టర్ గా చెప్పుకొచ్చాడు ప్రభాస్. ఈ సినిమా ప్రచారం కోసం తొలిసారి ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపిక పదుకోన్ కలిసి కూర్చున్నారు. ఈ సందర్భంగా తన క్యారెక్టర్ షేడ్స్ ను బయటపెట్టాడు ప్రభాస్.  Readmore!

Show comments

Related Stories :