మీడియాలో రామోజీ సంచలనాలు

సాంప్రదాయ పద్దతులకు పూర్తిగా వ్యతిరేకం రామోజీ రావు. వామపక్ష భావజాలం వుండేది. ఇలా ఎందుకు చేయకూడదు. ఇలా ఎందుకు వీలు కాదు అనే ఆలోచనలు సాగించేవారు. విజయవాడ కేంద్రంగా దినపత్రికలు వస్తుంటే, తెలుగు రాష్ట్రం నలుమూలలకు మధ్యాహ్నం, సాయంత్రం వేళకు అందుతుండేవి. ఉదయాన్నే ఎందుకు ఇవ్వలేము అనే ఆలోచన నుంచి పుట్టింది విశాఖ లో ఈనాడు పత్రిక. విశాఖ కేంద్రంగా మూడు జిల్లాలకు ఉదయాన్నే పత్రికను అది కూడా ఆరు గంటల లోపే అందించడం అన్నది ప్రధాన లక్ష్యం.

అప్పట్లో విలేకరులు అంటే జిల్లాకు ఒకరు వుంటే గొప్ప. అలాంటిది పట్టణానికి ఒకరు అనే కాన్సెప్ట్ ను తీసుకు వచ్చారు. ఇందుకోసం కాస్త బాగా రాసేవారు దొరకడం అరుదుగా వుండేది. అందుకే ఎక్కువగా ఉపాధ్యాయులను విలేకరులుగా తీసుకున్నారు ఆరంభంలో. పార్ట్ టైమర్లు గా అన్నమాట.

ప్రతి దినపత్రికకు యజమాని ఎవరైనా ఎడిటర్ గా ఎవరో ఒకరు వుండేవారు. ఈనాడు కు మాత్రం ఎడిటోరియల్ బోర్డ్ వుండేది. ఎడిటర్ గా రామోజీ పేరు మాత్రమే వుండేది.

సెక్స్ సంబంధిత విషయాలు బహిరంగంగా మాట్లాడడం అంటే అదో ఆరో వింత అనుకుకునే రోజుల్లో వారం వారం డాక్టర్ సమరంతో సెక్స్ సమస్యలు.. సమాధానాలు అంటూ ప్రారంభించి, హస్త ప్రయోగం అనే పదాన్ని జన బాహుళ్యంలోకి విపరీత ప్రచారంలోకి రావడానికి కారణం రామోజీనే. Readmore!

దినపత్రిక అంటే దిన ఫలాలు, వార ఫలాలు అంటూ జ్యోతిష్యం లేకుండా ఊహించలేని రోజులు. కానీ రామోజీ తన దిన పత్రికలో వారఫలాలు, దినఫలాలకు, తిధి, వారం, వర్జ్యం అనే వాటికి చోటివ్వలేదు. ఆధ్యాత్మిక వ్యాసాలు ఆమడ దూరం. దశాబ్దాల పాటు అలాగే నడిపారు. రామోజీకి పెద్ద కొడుకు కిరణ్ కు మాత్రం దైవ భక్తి ఎక్కువ. అందుకే కిరణ్ హయాం వచ్చాక దిన, వార ఫలాలు, ఆధ్యాత్మిక వ్యాసం ప్రారంభమైంది.

ఓ దినపత్రిక తనకు కావాల్సిన క్వాలిటీ సిబ్బంది కోసం ఓ స్కూలు స్టార్ట్ చేయడం అన్నది ఈనాడు జర్నలిజం స్కూలుతోనే మొదలైంది.

ప్రతి ఏరియాలో స్వంత కార్యాలయాలు, ప్రింటింగ్ యూనిట్ లు ప్రారంభమైంది ఈనాడుతోనే.

ఈనాడు కోసం స్వంత ఫాంట్ ను ఏర్పాటు చేసుకున్నారు. పదాలు, అక్షరాల మధ్య పొందిక, స్పేస్ సేవింగ్ ఇలా అన్నీ చూసుకుని దాన్ని రూపుదిద్దారు.

ఈనాడు కోసం ఓ పదకోశం ప్రత్యేకంగా తయారు చేయించారు.

ఇక ఈనాడులో పని విధానాలు, క్వాలిటీ చెక్ ఇవన్నీ చాలా వున్నాయి.

ఇన్ హవుస్ మార్కెటింగ్ అనేది, మన వనరులు మనం వాడుకోవడం అనేది ఈనాడు ను చూసి నేర్చుకోవాలి. రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ లు అవుతుంటే, వాటిని తన సినిమా పేజీకి అడ్వాటేజ్ గా మార్చడం అన్నది అతి చిన్న ఉదాహరణ మాత్రమే.

Show comments

Related Stories :