కల్కి సెటిల్ అయినట్లే!

నాగ్ అశ్విన్-ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన అత్యంత భారీ చిత్రం కల్కి. ఈ సినిమా విడుదల నాడు మూడు వంతులు పాజిటివ్ టాక్, ఒక వంతు మిక్స్ డ్ టాక్ వచ్చింది. భారీ రేట్ల అడ్వాన్స్ మీద స్వంతగా విడుదల చేసుకున్నారు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను నిర్మాత అశ్వనీదత్. అందువల్ల ఎలా వుంటుందో అన్నది ఒక ప్రశ్న. అసలు నాగ్ అశ్విన్ ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ కు వెళ్తాడా లేదా అన్నది మరో ప్రశ్న.

సినిమా చూసిన ప్రతి ఒక్కరూ నాగ్ అశ్విన్ టేకింగ్ ను, విజువల్స్ ను మెచ్చుకున్నారు. సెలబ్రిటీలు అంతా నాగ్ అశ్విన్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అందువల్ల ఇక ఆ విషయంలో క్లారిటీ ఫుల్ గా వచ్చేసింది. నో డౌట్.. నాగ్ అశ్విన్ ఇప్పుడు ఎక్కడో వున్నారు. తెలుగు దర్శకుల్లో టాప్ పొజిషన్ కు వెళ్లిపోయారు.

ఆ సంగతి అలా వుంచితే సినిమా విడుదలయిన తరువాత బి, సి సెంటర్లకు అందద‌ని, మినిమమ్ డిగ్రీ చేసిన వారికే అర్ధం అవుతుందని కామెంట్లు విసిరారు. కానీ ఈ లోగా ఒక గమ్మత్తు జరిగింది. సోషల్ మీడియాలో అర్జునుడు గొప్పా? కర్ణుడు గొప్పా? అన్న డిస్కషన్లు, అసలు అశ్వద్దామ క్యారెక్టర్ ఏమిటి? భారతంలో అశ్వధ్దామ మంచి వాడా? చెడ్డవాడా? అన్న డిస్కషన్లు మొదలయ్యాయి. ఇవన్నీ చూసి, జనం ఎందుకు ఇదంతా జరుగుతోంది అని ఆరా తీస్తే కల్కి సంగతి మరింతగా జనంలోకి వెళ్లింది.

దాంతో కల్కి చూడాలనే ఆసక్తి మొదలైంది. దాంతో కలెక్షన్లు మరింత స్టడీ అయ్యాయి. నైజాంలో ఇప్పటికే 40 కోట్ల షేర్ రాబట్టింది. ఇంకా సండే తో కలిపితే 50 కోట్లకు చేరుతుంది. అంటే మరో ఇరవై కోట్లు వసూలు చేస్తే, తీసుకున్న 72 కోట్ల అడ్వాన్స్ చెల్లు అయిపోతుంది. Readmore!

ఆంధ్రలో 90 కోట్ల మేరకు అడ్వాన్స్ లు తీసుకున్నారు. అక్కడ మాత్రం కొద్దిగా తక్కువ పడే అవకాశం వుంది. దానికి కారణం టికెట్ రేట్లు. సోమ లేదా మంగళ వారం నుంచి టికెట్ రేట్లు తగ్గించే అవకాశం వుంది. అలా జరిగితే మళ్లీ అక్కడ కూడా సినిమా కలెక్షన్లు సెటిల్ అవుతాయి.

ఇదిలా వుంటే నార్త్ బెల్ట్, ఓవర్ సీస్ ల్లో సినిమా మంచి ఊపు మీద వుంది.

Show comments

Related Stories :