కల్కి నో పెయిడ్ వ్యూస్!

టీజర్ ఇచ్చిన తరువాత కాస్త గ్యాప్ ఇచ్చిన కల్కి సినిమా నిర్మాతలు ప్రమోషన్లకు ఇప్పుడు శ్రీకారం చుడుతున్నారు. సినిమాలో రెండు పాటలే వుంటాయని టాక్. కాదు. నాలుగు పాటలు అని మరో టాక్. ఆ సంగతి ఎలా వున్నా, ప్రస్తుతానికి ఓ పాటను వదలబోతున్నారు. అందుకు సంబంధించిన ప్రోమో శనివారం బయటకు వస్తుంది.

టీజర్ కు రెస్పాన్స్ బాగానే వచ్చింది. పెయిడ్ వ్యూస్ జోలికి నిర్మాతలు పోలేదు. పెయిడ్ వ్యూస్ కు రూపాయి కూడా ఖర్చు చేయమని నిర్మాతలు స్థిరంగా వున్నారు. కల్కి టీజర్ కు వచ్చిన ఇరవై మిలియన్లకు పైగా వ్యూస్, ఆర్గానిక్ గా వచ్చినవే తప్ప వేరు కాదు. ఇప్పుడు పాట ప్రోమో, ఆ తరువాత పాట విడుదల చేస్తారు. వాటికి స్పందన ఎలా వుంటుందో చూడాలి.

ముంబాయి, ఢిల్లీ, చెన్నయ్ ల్లో మీడియా ఈవెంట్ లు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అమరావతితో గ్రాండ్ ఈవెంట్ చేసే ఆలోచనలో వున్న సంగతి తెలిసిందే. ఈ నెల 15 నుంచి 27 వరకు అంటే సుమారు 12 రోజుల పాటు వరుసగా ఏదో ఒక కంటెంట్ విడుదల చేస్తూనే వుంటారు. 

Readmore!
Show comments

Related Stories :