పది కోట్లు పొగొట్టిన నిర్మాత!

పందాలు వేయడం అన్నది ఇప్పుడు డబ్బు లేని కుర్రాళ్ల దగ్గర నుంచి డబ్బు చేసిన పెద్దోళ్ల వరకు పట్టుకున్న జాఢ్యం. అది క్రికెట్ కావచ్చు, ఎన్నికలు కావచ్చు. టాలీవుడ్ లో కూడా ఇచ్చి పిచ్చి గట్టిగానే వుంది. బెట్టింగ్ లు ఆడుతుంటారని టాక్ వుంది. అది నిజమో కాదో అన్స సంగతి పక్కన పెడితే, ఎన్నికల టైమ్ లో మాత్రం గట్టిగా పందాలు కాస్తుంటారనే వార్తలు కూడా బలంగా వున్నాయి.

టాలీవుడ్ లో ఎక్కువ మంది కూటమి గెలవాలి అని కోరుకున్న వారే. అందువల్ల నెంబర్ల సంగతి పక్కన పెట్టి కూటమికి అనుకూలంగా పందాలు కాసారు. అవన్నీ లక్షల్లో మాత్రమే, మహా అయితే అయిదు లక్షలు, పదిలక్షలు. నిర్మాతల స్టామినా చూసుకుంటే ఇవేమంత పెద్ద మొత్తాలు కావు.

కానీ ఓ నిర్మాత మాత్రం వైకాపాకు అనుకూలంగా భారీగా పందెం కాసి, చాలా అంటే చాలా భారీగా నష్టపోయినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో మిగిలిన బడా సంస్థల మాదిరిగా ఏడాదికి నాలుగైలు భారీ సినిమాలు, అందరు టాప్ హీరోలతో సినిమాలు లాంటి వ్యవహారాలు లేకున్నా, పెద్ద సంస్థే అది కూడా. చేసినవి భారీ సినిమాలే. పైగా డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ రంగాల్లో వున్న వారే. ఎన్నికలు ఇంకా ఓ స్టేజ్ కు రాకముందే అయిదు కోట్లు వైకాపాకు అనుకూలంగా పందెం కాసినట్లు తెలుస్తోంది.

ఈ అయిదు కోట్లు స్వంత డబ్బు ను పందెం ఒడ్డినట్లు, ఇది కాక, వేరే వాళ్ల దగ్గర తీసుకుని అయిదు కోట్లు పందెం ఒడ్డినట్లు టాలీవుడ్ లో గ్యాసిప్ బలంగా వినిపిస్తోంది. ఆ నిర్మాత ధైర్యానికి టాలీవుడ్ జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఎంత వైకాపా అంటే అభిమానం వున్నా, ఇలా చేయడం ఏమిటా? అని కామెంట్ చేస్తున్నారు. Readmore!

కొన్నాళ్ల క్రితం వరకు ఆర్ధికంగా ఇబ్బందుల్లో వుండి, తేరుకున్నారు. అలా తేరుకున్నాక మళ్లీ జాగ్రత్తగా వుండకుండా ఇలా చేయడం ఏమిటి? అని నిట్టూరుస్తున్నారు.

Show comments

Related Stories :