ఇండియన్ 2… మలిసగంలోనే

విక్రమ్ ఇచ్చిన సక్సెస్ కిక్ తో ఇండియన్ 2 ముందుకు వచ్చింది. కాస్త ముందు వెనుకలైనా, మొత్తానికి విడుదలకు సిద్దం అవుతోంది. చాలా కాలం తరువాత శంకర్ మ్యాజిక్ టచ్ ఏ మేరకు ఇంకా మిగిలి వుంది అన్నది క్లారిటీ వస్తుంది ఈ సినిమాతో. అలాగే ఈ సినిమా వర్క్ చూసిన తరువాతే రామ్ చరణ్-శంకర్ గేమ్ ఛేంజర్ మీద ఓ అంచనా ఏర్పడుతుంది. చెన్నయ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇండియన్ 2 లో అసలు క్రేజ్ అంతా సెకండాఫ్ లోనే వుంటుందని తెలుస్తోంది.

సినిమా తొలిసగంలో సిద్దార్ధ-బాబీ సింహాల సీన్లు ఎక్కువ వుంటాయని,ద్వితీయార్ధంలో విదేశాలకు వెళ్లిపోయిన భారతీయడు మళ్లీ ఎంటర్ అవుతాడని తెలుస్తోంది. అక్కడి నుంచి సినిమా చాలా ఆసక్తికరంగా వుటుందని టాక్. సినిమాలో రెండు మూడు బ్లాక్ లు షాకింగ్ గా వుంటాయని అంటున్నారు. శంకర్ అపరిచితుడు, భారతీయుడు సినిమాల్లో తప్పు చేసిన వాళ్లను చంపే సీన్లు ఒక్కొక్కటి ఒక్కోలా డిజైన్ సంగతి ఇప్పటికీ గుర్తుంది. ఇండియన్ 2 లో కూడా అలాంటి మంచి బ్లాక్ లు పడ్డాయని తెలుస్తోంది.

ఇండియన్ 2/భారతీయుడు 2 పబ్లిసిటీ కూడా గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే చెన్నయ్ లో భారీగా ప్రీరిలీజ్ ఈవెంట్ చేసారు. త్వరలో హైదరాబాద్ లో కూడా అదే రేంజ్ లో ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇండియన్ 2 కనీసం 20 కోట్లు వసూలు చేయాల్సి వుంది.

Readmore!
Show comments

Related Stories :