టాలీవుడ్ లో ఎగ్జిట్ పోల్ బెట్టింగ్

ప్రస్తుతం బెట్టింగ్స్ జోరుగా సాగుతున్నాయి. క్రికెట్ బెట్టింగ్, ఆన్ లైన్ బెట్టింగ్స్ రొటీన్.. ఇప్పుడంతా ఎగ్జిట్ పోల్స్ బెట్టింగ్ నడుస్తోంది. మరీ ముఖ్యంగా టాలీవుడ్ లో చాలామంది ఇదే పని మీద ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఎవరు గెలుస్తారనే విషయం 4వ తేదీ తెలుస్తుంది. దానికి సంబంధించిన అంచనాలు 1వ తేదీ సాయంత్రానికి ఎగ్జిట్ పోల్స్ రూపంలో వచ్చేస్తాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ ఎవరికి అనుకూలంగా వస్తాయనే అంశంపై ఇప్పుడు జోరుగా బెట్టింగ్ సాగుతోంది.

టాలీవుడ్ కు చెందిన ఓ నిర్మాత దాదాపు ఏడాది కిందట ఓ సినిమా తీశాడు. తనకుతాను హిట్ బొమ్మ తీశానని చెప్పుకునే ఆ నిర్మాత, ప్రస్తుతం ఈ బెట్టింగ్ పనిలో బిజీగా ఉన్నాడు. తన సినీ మిత్రులతో కలిసి దాదాపు 50 లక్షల రూపాయలు పెట్టాడని టాక్.

మరో నిర్మాత ఉన్నాడు. ఒంగోలు మూలాలు కలిగిన ఈ నిర్మాత చాన్నాళ్ల కిందటే హైదరాబాద్ లో సెటిల్ అయ్యాడు. కానీ వారానికి ఓసారైనా ఆంధ్రా-తెలంగాణ మధ్య చక్కర్లు కొడతాడు. ఇప్పటివరకు అన్నీ ఫ్లాపులే తీశాడు. నాలుగో సినిమాకు రెడీ అవుతున్నాడు. Readmore!

ముందుగా 30 లక్షలు పెట్టి సినిమా స్టార్ట్ చేయాలని, మిగతాది ఫైనాన్స్ తెచ్చి మేనేజ్ చేయాలనేది ఇతగాడి ప్లాన్. ఎప్పుడైతే ఎగ్జిట్ పోల్స్ పై బెట్టింగ్ మొదలైందో, తన దగ్గరున్న 30 లక్షలు అందులో పెట్టేశాడు. పోతే 30 లక్షలు పోతాయి, వస్తే 90 లక్షలొస్తాయి. నిజంగా అదృష్టం వరిస్తే ఫైనాన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు.

మరో నిర్మాతది తిరుపతి. అటుఇటు మేనేజ్ చేసి డబ్బులు పోగేసి సినిమాలు తీయడం, ఇతర సినిమాల్లో పెట్టుబడులు పెట్టడం ఇతడి వ్యాపారం. ఇప్పుడీ నిర్మాత కూడా ఎగ్జిట్ పోల్ బెట్టింగ్ లో డబ్బులు పెట్టాడు. ఇంకో 3 రోజుల్లో వస్తే 60 లక్షలు వస్తాయంటున్నాడు, పోతే 15 లక్షలు పోతాయంటున్నాడు. ఇది ఇతగాడి కాలిక్యులేషన్.

ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, పైకి కనిపించకుండా చాలామంది బెట్టింగులో డబ్బులు పెట్టారు. ఐదేళ్లకు ఒకసారే కదా అనేది కామన్ సమాధానం కాగా.. తమ పార్టీపై ఉన్న నమ్మకం అలాంటిదంటున్నారు మరికొంతమంది. పార్టీతో సంబంధం లేకుండా న్యూట్రల్ గా  బెట్టింగులు పెట్టిన వాళ్లు కూడా ఉన్నారు. ఇందులో నిర్మాతలతో పాటు, జూనియర్ ఆర్టిస్టులు, కొంతమంది చిన్న హీరోలు, ఓ మ్యూజిక్ డైరక్టర్ కూడా ఉన్నాడు.

Show comments

Related Stories :