కల్కి.. మరో లెవెల్.. అంతే!

నాగ్ అశ్విన్- ప్రభాస్ కాంబినేషన్ సినిమా కల్కి ప్రచారానికి తొలి అడుగు పడింది. సినిమా కోసం కోట్ల ఖర్చుతో తయారుచేసిన వింత కారు ‘బుజ్జి’ ని ఈ రోజు సినిమా అభిమాన ప్రపంచానికి పరిచయం చేసారు. ఈ మేరకు వందలాది అభిమానుల నడుమ భారీ ఫంక్షన్ ను నిర్వహించారు.

హీరో ప్రభాస్ స్వయంగా ఆ కారును కాస్సేపు నడిపి చూపించారు. ఆ తరువాత ఈ కారు తో హీరొ రిలేషన్ కు సంబంధించి చిన్న వీడియోను విడుదల చేసారు. ఈ వీడియో సినిమా మీద అంచనాలను మరింత పెంచింది. పైగా ఫంక్షన్ కు వచ్చిన ప్రభాస్ పూర్తి ఆరోగ్యంగా, హుషారుగా, అందంగా, హుందాగా కనిపించాడు. ఇది ఫ్యాన్స్ ను మరింత ఉర్రూతలూగించింది.

బాహుబలి తరువాత రికార్డులు బ్రేక్ చేసే సినిమాను ప్రభాస్ అందిస్తున్నాడన్న నమ్మకం పెరిగింది. లాంగ్ కోటు, లాంగ్ హెయిర్ తో ప్రభాస్ లుక్ అభిమానులను ఆకట్టుకుంది. సినిమాలో లుక్ తోనే ప్రభాస్ ఫంక్షన్ హాజరు కావడం అన్న కాన్సెప్ట్ బాగుంది. దీనివల్ల సినిమా మీద, సినిమాలో వర్క్ మీద, అన్నింటికి మించి హీరో గెటప్ మీద ఓ అంచనా ఏర్పడింది.

కల్కి సినిమా విడుదల నెల రోజుల్లో వుంది. ఇంత భారీ సినిమాకు ప్రపంచం అంతటా ప్రచారం సాగించాల్సి వుంది. అందువల్ల తెలుగులో ఫస్ట్ ఫంక్షన్ చేసి, ఇక దేశం మీదకు టీమ్ వెళ్తుందని తెలుస్తోంది. సినిమాలో వున్నది ఒకటే పాట కావడం వల్ల, ప్రచారానికి రొటీన్ పద్దతి కాకుండా కొత్త పుంతలు తొక్కాల్సి వుంటుంది. అందులో భాగమే ఈ రోజు జరిగిన ఫంక్షన్. Readmore!

Show comments

Related Stories :