బాలయ్య @ 34 కోట్లు!

సీనియర్ హీరోల్లో వరుసగా సినిమాలు చేయడమే కాదు, రెమ్యూనిరేషన్ అందుబాటులో వుంచే హీరో బాలకృష్ణ ఒక్కరే. ఫ్లాపులు వరుసపెట్టి ఇస్తూ పోతూ వున్నా, పాతిక ముఫై కోట్లు తీసుకునే సీనియర్ హీరోలు వున్నారు. కానీ బాలయ్య మాత్రం పది కోట్ల దగ్గరే వుంటూ వచ్చారు. ఒక్కో హిట్ కు నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్తున్నారు.

వీరసింహారెడ్డి టైమ్ లో 10 నుంచి 14 కు వచ్చారు. 14 నుంచి 18 కి వచ్చారు భగవంత్ కేసరి సినిమాకు. బాబీ-సితార సినిమాకు 30 కోట్ల వరకు తీసుకుంటున్నారని వార్తలు వినిపించాయి. ఇప్పుడు బోయపాటి తో సినిమాకు 34 కోట్లు రెమ్యూనిరేషన్ అని తెలుస్తోంది.

బాలయ్య మార్కెట్ కూడా అఖండ నుంచి పెరుగుతూనే వుంది. వంద నుంచి 120 కోట్లకు చేరుకుంది. అలాగే బోయపాటి కాంబినేషన్ అంటే ఇంకా క్రేజ్ వుంటుంది. ఎంత ఖర్చయినా వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలు నిర్మాతలకు అంతో ఇంతో మిగిల్చాయి కానీ చేతులు కాల్చలేదు. అందువల్లే బాలయ్య తో సినిమాలకు నిర్మాతలు ఆసక్తిగా వున్నారు.

14రీల్స్ ప్లస్ పతాకంపై బాలయ్య- బోయపాటి సినిమా తరువాత ఈసారి స్వంత సినిమా వుండొచ్చు. బాలయ్య రెండో కుమార్తె తేజస్విని నిర్మాతగా మారుతున్నారు. బోయపాటి సినిమాకు ప్రెజెంటర్ గా పేరు వేసారు. ఆ తరువాత ప్రాజెక్ట్ కు ఆమె నే నిర్మాతగా వుండే అవకాశం వుంది. Readmore!

Show comments

Related Stories :