సిఎమ్ఓ అయితే నాకేంటీ!

గత ప్రభుత్వంలో వైభోగం వెలగబట్టిన వారి లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అతగాడో ‘పిలగాడు’. కానీ వాళ్ల నాన్న మాత్రం సిఎమ్ కు రైట్.. లెఫ్ట్.. సెంటర్. .అన్నీ. దాంతో ఈ పిలగాడికి కూడా పవర్ వచ్చేసింది. దాంతో పొగరూ వచ్చేసింది. ఇక చూసేదేముంది.. ఇష్టా రాజ్యం. విశాఖలో ఇతగాడికో, ఇతగాడి బినామీలకో ఒక స్థలం వుంది. దాని పక్కన పాపం, అమాయక బ్రాహ్మణ కుటుంబానికి కొంత స్ధలం వుంది.

ఎప్పుడైతే అమాయక బ్రాహ్మణ కుటుంబం అని తెలిసిందో ఈ ‘పిలగాడు’ తిన్నగా ఇంటికే వెళ్లిపోయి ధాష్టీకం ప్రదర్శించాడు. అమ్ముతారా.. అమ్మరా? అంటూ. పాపం, వాళ్లు గట్టిగా సమాధానం ఇవ్వలేకపోయినా, ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఓ వ్యక్తితో కాస్త పరిచయం లేదా బంధుత్వం వుంది. దాంతో అక్కడికి ఫోన్ చేసారు. ఆయనేమో, తన బంధువు అని చెప్పండి అని ఓ సలహా ఇచ్చాడు. వాళ్లు అదే చెప్పారు. అయితే నాకేంటీ… అంటూ కిందా మీదా పెట్టడం, ఆఖరికి సిఎమ్ కార్యాలయంలో కీలకమైన ఆ వ్యక్తి నేరుగా కలుగచేసుకోవాల్సి రావడం జరిగింది.

అప్పుడు కానీ ఆ భూమిని, వాళ్ల ఇంటిని వదిలి కదలలేదు ఆ ‘పిలగాడు’. ఈ పిలగాడు చాలా మంది టికెట్ ఆశాజీవుల దగ్గర కూడా కాస్త గట్టిగానే లాగినట్లు వినిపిస్తోంది. కోటి నుంచి కోట్ల వరకు వాళ్ల దగ్గర నుంచి లాగేసాడట. కానీ టికెట్ లు రాలేదు. ఎన్నికల ముందు వరకు ఏమీ మాట్లాడలేకపోయారు. ఇప్పుడు ఫోన్ లు చేసి నిలదీద్దామంటే స్విచాఫ్.

అదీ సంగతి. Readmore!

Show comments

Related Stories :