హైదరాబాద్ లోనే పవన్?

పవన్.. ఎప్పుడు.. ఎక్కడికి.. మళ్లీ ఎప్పుడు వచ్చారు?

పబ్లిక్ లైఫ్‌లో వుండే వారికి కొన్ని ఇబ్బందులు తప్పవు. వాళ్లు ఎక్కడ వున్నారు. ఏం చేస్తున్నారు అనే క్యూరియాసిటీ వుంటుంది. సినిమా హీరోలు వాళ్లకు ఇష్టమైతే, ఫలానా రోజు వస్తున్నారు, ఫలానా దగ్గరకు వెళ్తున్నారు అంటూ ముందే న్యూస్ ఇస్తారు. ఎందుకంటే ఫ్యాన్స్ ఎగేసుకుని వెళ్లి, కేరింతలు కొట్టడం కోసం. అదే వాళ్లకు ఇష్టం లేకపోతే అంతా గుట్టుగా దాచేస్తారు.

జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ఎన్నికలు ముగిసాక ‘ఎక్కడికో’ వెళ్లారు. మోడీ నామినేషన్ కోసం వారణాసి వెళ్లారు. అక్కడి నుంచి మరి దుబాయ్ నే వెళ్లారో? సింగపూర్ నే వెళ్లారో? లేదా హైదరాబాద్ ఇంట్లోనే వున్నారో? ఎవరికీ తెలియదు.

చంద్రబాబు వెనక్కు వచ్చేసారు. జగన్ వస్తున్నారు. మరి పవన్ సంగతేమిటి? శుక్రవారం నాటికి మంగళగిరి వెళ్తారు అనే వార్తలు వున్నాయి. Readmore!

అంటే పవన్ ఇండియాలోనే వున్నాట్లా? వెనక్కు వచ్చినట్లా?

విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ తిరిగి వచ్చేసారు. నిన్నటికి నిన్న పవన్ వెళ్లి తన సన్నిహతుడు త్రివిక్రమ్ తో కొంత సేపు గడిపినట్లు తెలుస్తోంది. రేపు మంగళగిరి వెళ్తారని బోగట్టా. మొత్తానికి ఏమైనా పవన్ వ్యక్తిగత జీవితం మాత్రం పూర్తిగా గుంభనమే.

Show comments

Related Stories :