పాహిద్ ఫాజిల్.. తెలివైన పని!

పుష్ప విలన్ గా మాత్రమే కాదు, ఓటిటి సినిమాల ద్వారా కూడా ఫాహిద్ ఫాజిల్ మన జనాలకు బాగా పరిచయం అయిపోయారు. సాధారణంగా మలయాళ సినిమాల నిర్మాణం వ్యయం తక్కువ వుంటుంది. అంటే నటులు కూడా తక్కువ తీసుకుంటారు అనుకోవాలి. కానీ మన దగ్గరకు వచ్చే సరికి కాస్త గట్టిగానే తీసుకుంటారు. అయితే వారి వల్ల సినిమాకు వచ్చే మైలేజ్, అదర్ లాంగ్వేజ్ రైట్స్ ద్వారా రికవరీ అయిపోతుంది కనుక పెద్దగా సమస్య లేదు.

పుష్ప 2 కి హీరో, దర్శకుడు భారీగా రెమ్యూనిరేషన్లు తీసుకుంటున్నారన్న వార్తలు వున్న నేపథ్యంలో ఫాహిద్ ఫాజిల్ ఎంత తీసుకుంటారు అనే ఆసక్తి వుంది. టాలీవుడ్ జనాల మాదిరిగానే ఫాహిద్ కూడా పుష్ప 2 సినిమాకు రోజుల వారీ లెక్కన రెమ్యూనిరేషన్ చార్జ్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మన దగ్గర టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు నాలుగున్నర లక్షల వరకు రోజుకు తీసుకుంటారు. అయితే ఫాజిల్ రోజుకు పన్నెండు లక్షల వరకు చార్జ్ చేస్తారని తెలుస్తోంది.

ఇక్కడ ఓ గమ్మత్తు కూడా వుంది. ఆర్టిస్ట్ లు డేట్ ఇచ్చాక, షూట్ క్యాన్సిల్ కొట్టినా కూడా రెమ్యూనిరేషన్ ఇస్తారు. పాజిల్ ఇక్కడ ఓ కండిషన్ కూడా పెట్టారట. ఒక వేళ ఫాజిల్ హైదరాబాద్ వచ్చిన తరువాత కూడా యూనిట్ కనుక అనుకోకుండా షూటింగ్ క్యాన్సిల్ కొడితే తీసుకోవాల్సిన దాని కన్నా రెండు లక్షలు అదనంగా తీసుకుంటారని తెలుస్తోంది.

ఇలా చేస్తే నిర్మాత, దర్శకుడు జాగ్రత్తగా వుంటారు. షూటింగ్ క్యాన్సిల్ కొడితే మరింత ఎక్కువ ఖర్చు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటారు. ఫాజిల్ వైపు నుంచి చూస్తే, వర్కింగ్ డేస్ వృధా కాకుండా చకచకా సినిమాలు చేసుకోవచ్చు. Readmore!

ఈ విధంగా మన హీరోలు ఎప్పుడు ఆలోచిస్తారో. ఊ అంటే షూట్ క్యాన్సిల్..ఆ అంటే షూట్ క్యాన్సిల్ చేసే హీరోలు మన దగ్గర చాలా మందే వున్నారు.

Show comments

Related Stories :