సినిమా అయినా ఇంకేదైనా పదిహేనే!

రోజులు ఎలా మారుతున్నాయి అంటే, బతకడం ముఖ్యం. ఎలా బతికాము అన్నది కాదు. ప్రస్తుతం కొద్ది మంది పరిస్థితి అలాగే వుంది.

ఏదో సాధిద్దామని సినిమా రంగంలోకి వస్తారు. పోటీ ఎక్కువ. లక్ తక్కువ. చాన్స్ లూ తక్కువే. దాంతో బతకడం కోసం ‘పక్క’దారి పట్టక తప్పదు. అందం చందం బాగానే వున్నా, కొన్ని సినిమాల్లో నటించినా అదృష్టం కలిసి రాని ఒకరిద్దరు హీరోయిన్లు ఇలా ‘పక్క’దారి పట్టినట్లు గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.

ఇలాంటి గ్యాసిప్ లు గతంలోనూ వున్నాయి. కానీ ఇటీవల తగ్గాయి. ఇక్కడ నుంచి అమెరికాలు, ఆస్ట్రేలియాలు వెళ్లినపుడు మాత్రం అక్కడ ఇలాంటి వ్యవహారాలు చక్కబెడుతూ వుంటారని టాక్ వుంది.

ఆ సంగతి అలా వుంచితే పెద్ద సినిమాల్లో నటించినా కూడా అవకాశాలు రాని చిన్న హీరోయిన్లు ఒకరిద్దరు నగరం నడిబొడ్డులోని స్టార్ హోటల్ ఆధారంగా బతికేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. సినిమా చాన్స్ దొరికితే మహా అయితే పది నుంచి పదిహేను లక్షలు మించి రావు. అదే డబ్బులు ఇస్తే ‘పక్కదారి’ పట్టడానికి సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి హీరోయిన్లలో అయిటమ్ సాంగ్ నుంచి స్టార్ట్ చేసి, హీరోయిన్ గా ఎదిగిన వారు కూడా వున్నారని టాక్ వినిపిస్తోంది. Readmore!

కొంతమంది హమ్మో… పదిహేను లక్షలా అని అంటుంటే.. మరి కొంత మంది ఎవరి ద్వారా మాట్లాడాలి? అనే క్వశ్చను వేస్తున్నారు. జనాల దగ్గర డబ్బులు ఎక్కువయిపోయాయి. సుఖాలకు లక్షలు విసరడం పెద్ద అమౌంట్ అనిపించుకోవడం లేదు. అందుకే ఈ వ్యవహారం ఉభయ కుశలోపరి అన్నట్లు సాగిపోతోంది. గుట్టుగా.. కానీ గ్యాసిప్ వినిపించడం ఆగవుగా.

Show comments

Related Stories :