హాస్పిటల్ లో చేరిన షారూక్ ఖాన్

బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారూక్ ఖాన్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. ఆయనకు వడ దెబ్బ తగిలింది. విపరీతమైన ఎండ వల్ల డీహైడ్రేషన్ జరిగి షారూక్ కు వడదెబ్బ తగిలింది. వెంటనే అతడ్ని అహ్మదాబాద్ లోని కేడీ హాస్పిటల్ లో జాయిన్ చేశారు.

ఐపీఎల్ మ్యాచుల్లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ ను చూసేందుకు అహ్మదాబాద్ వచ్చాడు షారూక్. అతడితో పాటు కూతురు సుహానా, చిన్న కొడుకు అబ్ రామ్, మేనేజర్ పూజా వచ్చారు.

ఇక కేకేఆర్ కో-ఓనర్స్ జూహి జావ్లా, జే మెహ్తా కూడా షారూక్ తో పాటు వచ్చారు. వీళ్లతో అనన్య పాండే కూడా కలిసింది. అంతా కలిసి మ్యాచ్ ను ఎంజాయ్ చేశారు. మ్యాచ్ అనంతరం షారూక్ అందరికీ అభివాదం చేశాడు. చేతులు చాచి తన సిగ్నేచర్ పోజు కూడా ఇచ్చాడు.

ఇలా స్టేడియంలో ఉత్సాహంగా గడిపిన షారూక్, ఈరోజు కాస్త నలతగా ఫీల్ అయ్యాడు. మధ్యాహ్నానికి మరింత నీరసంగా మారడంతో వెంటనే అతడ్ని హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అక్కడే ఉన్న జూహీ చావ్లా హాస్పిటల్ కు చేరుకుంది. షారూక్ భార్య గౌరీఖాన్ కూడా ముంబయి నుంచి అహ్మదాబాద్ వచ్చింది. Readmore!

ప్రస్తుతం షారూక్ పరిస్థితి నిలకడగా ఉన్నట్టు హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రకటించారు. ఈరోజు రాత్రి అబ్జర్వేషన్ లో ఉంచి, రేపు షారూక్ ను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది.

Show comments

Related Stories :