సినిమాల సంగతేంటి!

ఎన్నికల హడావుడి ముగిసిపోతోంది ఈ వారంతో. టాలీవుడ్ కు కీలకమైన రెండు నెలల సమయం ఆవిరైపోయింది. చిన్న సినిమాలు కాస్త సర్దుకున్నాయి. ఇక ఇప్పుడు వున్న టైమ్ ను వాడుకోవాలి. మే నెలలో ఇంకా రెండు వారాలు వున్నాయి. వీటిని కూడా వాడుకోవడం లేదు టాలీవుడ్. ఈ వారం సత్యదేవ్ కృష్ణమ్మ, నారా రోహిత్ ప్రతిధ్వని సినిమాలు వున్నాయి. కానీ కీలకమైన ఎన్నికల పోలింగ్ తేదీ ముందు రోజు. అందరూ జర్నీ లో వుండే టైమ్. ఓటింగ్ కోసం ఎక్కడెక్కడి నుంచో తమ తమ ప్లేస్ లకు వెళ్లే హడావుడి. అందువల్ల ఈ వారం అద్భుతాలు జరుగుతాయని అనుకోవడానికి లేదు.

ఇక ఎన్నికల పోలింగ్ తరువాత వచ్చే వారం నుంచి సినిమాల సందడి మొదలవుతుంది అనుకున్నారంతా, విష్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కి మంచి డేట్ దొరికింది అనుకున్నారు. కానీ ఇప్పుడు అది కాస్తా వాయిదా పడింది. దీంతో ఎన్నికల హడావుడి ముగిసిపోయినా సినిమాలు రాని పరిస్థితి నెలకొంది. మే నెల అంతా దాదాపు పెద్ద సినిమాలు లేకుండా ముగిసిపోబోతోంది. టిల్లు లాంటి మాంచి మాస్ సినిమా కనుక ఇప్పుడు వస్తే జనాలు ఓ రేంజ్ లో థియేటర్ కు పరుగెడతారు.

జూన్ నెల నుంచే సందడి మొదలవుతుంది. కానీ అక్కడి నుంచి సినిమాల విడుదలలు కాస్త రిస్క్ నే. ఎందుకంటే వర్షాలు ఎప్పుడు వుంటాయో తెలియదు. స్కూళ్ల ఓపెనింగ్, ఇలా చాలా ఫ్యాక్టర్లు వుంటాయి. పెద్ద హీరోలు అంతా పాన్ ఇండియా సినిమాల మీద పడడంతో, ఏ సినిమా విడుదల డేట్ మీద కూడా భరోసా లేదు. క్లారిటీ లేదు. దాంతో అంతా అయోమయంగా తయారయింది. పుష్ప 2 సినిమా ఒక్కటే అనుకున్న డేట్ కు వచ్చేలా కనిపిస్తోంది.

నిజానికి చాలా పెద్ద సినిమాలు వున్నాయి. ఇండియన్ 2, కల్కి, దేవర, గేమ్ ఛేంజర్, ఓజి, ఇలా జాబితా అయితే పెద్దగానే వుంది. కానీ డేట్ లు వస్తూనే వుంటాయి. మారుతూనే వుంటాయి. విడుదల కోసం వేచి చూడడమే. టాలీవుడ్ ఇక పై ఇలాగే నడుస్తుంది. ఏడాదికి కనీసం ఆరు నుంచి ఎనిమిది పెద్ద సినిమాలు వస్తే ఆ కిక్కు వేరు. కానీ మిడ్ రేంజ్ లేదా చిన్న సినిమాలుగా విడుదలై పెద్ద సినిమాలుగా మారుతున్న వైనం ఎక్కువగా వుంటోంది తప్ప, పెద్ద సినిమాలు వచ్చి, మరింత పెద్ద సినిమాగా మారే వైనం తక్కువగా వుంటోంది.

Readmore!

అంతా ‘చిత్రం’.

Show comments

Related Stories :