పెళ్లి చేసుకోవాలనే వుంది...కానీ...!

అనుష్క. తెలుగు నాట మంచి ప్రతిభ పాటవాలు కలిగిన హీరోయిన్లలో ఒకరు. దాదాపు దశాబ్దంన్నర కాలంగా మంచి మంచి సినిమాలు చేస్తూనే వస్తున్నారు. అరుంధతి, వేదం, బాహుబలి, భాగమతి ఇలా ఎన్నో మరుపురాని పాత్రలు. కాస్త గ్యాప్ తరువాత అనుష్క చేసిన సినిమా మిస్ శెట్టి.. మిసెస్ పోలిశెట్టి. ఈ సినిమా ఈ వారం విడుదలవుతున్న నేఫథ్యంలో అనుష్క ‘గ్రేట్ ఆంధ్ర’ తో ఫోన్ లో మాట్లాడారు. ఆ విశేషాలు

హాయ్ అండీ..

హాయ్ అండీ, ఎలా వున్నారు.. అంతా బాగున్నారా? మీ ఇంట్లో.

బాగున్నారండీ.. విత్ బాబా బ్లెసింగ్స్ Readmore!

ఓహ్.. మీరు కూడా బాబా డివోటీనా.. సేమ్ పించ్.. నేను కూడా.

మరీ ఇంత గ్యాప్ నా.. మీ సినిమా వచ్చి మూడేళ్లు దాటిపోతోంది.

మూడేళ్లు కాదండీ తెరమీద కనిపించి అయిదేళ్లు దాటింది. భాగమతి తరువాత మళ్లీ ఇదే.

ఎందుకని? ఏమిటి సమస్య?

సమస్య ఏమీ లేదు. కాస్త బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ స్టార్ట్ చేసాను. ఈ సినిమా తరువాత మలయాళ సినిమా వుంది. దాని తరువాత తెలుగు ఒకటి తమిళం ఒకటి చేస్తాను.

యువి.. ప్రమోద్.. ఇవి కాకుండా ఈ సినిమా చేయడానికి మిమ్మల్ని ముందుకు నడిపిన పాయింట్.

కథేనండీ.. నిజానికి ఇది నాకోసం చేయలేదు. ప్రమోద్, వినయ్ వీళ్ల ద్వారా ఈ కథ ఒకటి వుంది అని విన్నాను. మహేష్ కథ నాకు జస్ట్ అలా చెబితే ఎవరితో చేస్తున్నారు అని కూడా అడిగా. ఎక్కడో లోపల నాకు చిన్న ఆశ. ఈ సినిమా నేను చేస్తే బాగుంటుందని. ఏమైనా డెస్టినీ అండీ. మనం ఏ సినిమాలు, ఏ పాత్రలు చేసినా మనకు రాసిపెట్టి వుండాలి. అరుంధతి సినిమా నాకు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో వచ్చింది. నాకు ఏమీ తెలియని టైమ్ లో చేసాను అది.

అంతలా నచ్చడానికి మిస్ శెట్టిలో ఏముంది?

మనం రకరకాలుగా వుంటూ వుంటాం. ఒకరి దగ్గర ఒకలా.. ఇంకొకరిదగ్గర ఇంకోలా. కానీ మనం మన ఇంటికి వచ్చేస్తే, మనలో వున్న షేడ్స్ వేరుగా వుంటాయి. అలా నాలో వున్న షేడ్స్ కు దగ్గరగా వుంటుంది ఈ సినిమాలో పాత్ర.

ఇలాంటి సబ్జెక్ట్ లు హ్యాండిల్ చేయడం చాలా కష్టం కదా.. ఫన్ మిస్ కాకూడదు. అలా అని ఎమోషనల్ కంటెంట్ వుండాలి.

నిజమే మహేష్ నాకు కథ చెప్పినపుడు అదే అడిగాను. ఎలా హ్యాండిల్ చేద్దాం అనుకుంటున్నారు అని. ఆయన వివరంగా చెప్పి నన్ను ఒప్పించారు.

సినిమాలో ఏది ఎక్కువగా వుంటుంది? ఎంటర్ టైన్ మెంటా? ఎమోషనా?

రెండూ.. రెండూ వుంటాయి.  

ఎవరి పాత్ర ఎక్కువ.. ఎవరి పాత్ర తక్కువ.. ఇలాంటి భావన ఏమైనా కలుగుతుందా?

అస్సలు కలగదు. ఎందుకంటే రెండు పాత్రలు వేర్వేరు వాతావారణాల్లో పెరిగి వస్తాయిం. కానీ రెండూ ఒకలాంటివే. కానీ అవి పెరిగిన వాతావరణం వల్ల దానికి అనుగుణంగా ప్రవర్తిస్తూ వుంటాయి.

మీ కన్నా బాగా చిన్న వయసు హీరోతో చేయాల్సి వచ్చింది. కథ పరంగానా? కాస్టింగ్ పరంగానా?

అలా కచ్చితంగా చెప్పలేను. చెప్పాను కదా.. రెండూ ఒకటే లాంటి స్వభావం కలిగి, వేరు వేరు వాతావరణాల్లో పెరిగిన పాత్రలు

ఈ జనరేషన్ లో వృత్తి, ఉద్యోగం, లక్ష్యం, వీటన్నింటి తరువాతే పెళ్లి అనే కాన్సెప్ట్ పెరుగుతోంది. ఒక స్టేజ్ కు రీచ్ అయిన తరువాతే పెళ్లి కేసి చూస్తున్నారు. మీ వరకు మీ స్వభావం ఎలాంటిది?

నేను సంప్రదాయ వాదినే. పెళ్లి, పిల్లలు, కుటుంబం ఇవన్నీ వుండాలనే అనుకుంటాను. ఆ మాటకు వస్తే నేను చాలా సెన్సిటివ్. నా బాధ ఎవరితో అయినా షేర్ చేసుకోవాలనుకుంటాను. నాకు ఏడుపు వచ్చిందంటే ఇంక అలా ఏడుస్తూనే వుంటాను. నేను పక్కా ఫ్యామిలీ పర్సన్ ను. ఎమోషనల్ డిపెండెన్సీ కోరుకుంటాను.

నవీన్ హైపర్ యాక్టివ్.. మీరు సైలంట్ గా, సటిల్డ్ గా వుంటారు. ఇద్దరికీ సెట్ లో ఎలా వుండేది.

సెట్ లో ప్రతి ఒక్కరికీ ఏదో సమస్య వుంటుందండీ. కొందరు చెబుతారు. కొందరు చెప్పలేరు. ఎంత హుషారుగా వున్నా ఈ స్థాయికి రావడానికి నవీన్ ఎంతో కొంత కష్టపడే వుంటారు కదా. అదే అన్నాను కూడా ఆయనతో. మీరు ఎంత జోవియల్ గా వున్నా, వేరే ఆలోచనలు కూడా వుంటాయి కదా అని.

మీరు ఫుడీ నా?

కాదండీ.. అస్సలు కాదు.

ప్రభాస్, ప్రమోద్ లతో స్నేహం తరువాత కూడా ఫుడీగా మారలేదా?

వాళ్లతో ఫ్రెండ్ షిప్ వుంటే ఫుడీ లు కూడా పుడ్ మానేయాల్సిందే. వాళ్ల వ్యవహారం అలా వుంటుంది. మిర్చి టైమ్ లో లావిష్ బ్రేక్ ఫాస్ట్ వుండేది. అది అవుతుంటేనే లంచ్ కు ఏమిటి అనే డిస్కషన్ మొదలయ్యేది.

వాళ్లతో స్నేహం వల్ల మీకు నచ్చిన తెలుగు వంటకాలు ఏమిటి?

ముద్దపప్పు.. ఆవకాయ.. ఎప్పుడయన్నా రొయ్యలు

అందరూ అనేకసార్లు అడిగే వుంటారు..పెళ్లి సంగతేమిటి అని.. మళ్లీ అడిగితే మీ సమాధానం

చేసుకోవాలనే వుంది. కానీ.. అదేదో అంటారు.. ఏదో వస్తే ఆగదు అని

కక్కు వచ్చినా, కళ్యాణం వచ్చినా..

ఆ అదే.. ఆ టైమ్ రావాలి. జరగాలి.

అంటే జాతకాలు నమ్ముతారా..బాగా..

లేదండీ, మా ఇంట్లో ఎవరికీ జాతకాలే లేవు.

కానీ రాహు కేతు పూజలు..ఇంకా.. ఇంకా తరచు చేస్తుంటారు కదా.

ఆ. అవి చేస్తూనే వుంటాం. మా ఇంట్లో ప్రతి రెండు నెలలకు అమ్మ.. నాన్న పూజలు చేస్తూనే వుంటారు. దుర్గా నమస్కార.. రాహుకేత పూజ.. ఇలా చాలా వున్నాయి.నిజానికి ఆ దీపాలు, ముగ్గులు.. అవన్నీ నాకు కూడా బాగా ఇష్టం.

మీరు జనాల ముందుకు ఎందుకు రావడం లేదు? మీ సమస్య ఏమిటి?

సమస్య ఏమీ లేదు. పర్సనల్ ఇస్యూస్ వల్ల..

అంటే హెల్త్ ప్రోబ్లెమ్స్ నా?

కాదు.. అవన్నీ సెట్ అయిపోయాయి. కొన్ని కమిట్ మెంట్ల వల్ల కూడా ప్రమోషన్లకు రాలేకపోయాను. వీలయినంత త్వరగా రావాలనే నాకూ వుంది.

ప్రభాస్ తో మళ్లీ సినిమా ఎప్పుడు?

మాంచి స్క్రిప్ట్ చూపించండి.. వెంటనే రెడీ. నాకు కూడా చేయాలనే వుంది.  కానీ సరైన స్క్రిప్ట్ దొరకాలి కదా.

ఈ సినిమా సక్సెస్ మీట్ అయినా మీరు బయటకు వస్తారా?

చూద్దాం… ప్రస్తుతానికి ఫింగర్స్ క్రాస్ చేసుకుని వున్నా… చాలా టెన్షన్ గా వుంది. కొత్తగా తొలిసారి సినిమా చేసినట్లు వుంది. మీరు నా సక్సెస్ కోసం బాబాను ప్రార్ధించండి

తప్పకుండా..

ఈసారి హైదరాబాద్ వచ్చినపుడు తప్పకుండా కలుద్దాం.. థాంక్యూ.

థాంక్యూ

-విఎస్ఎన్ మూర్తి

Show comments

Related Stories :