మొక్కను పెంచేది పచ్చదనం కోసం కాదు, పగ కోసం

వినడానికి చాలా కొత్తగా ఉంది కదా. ఈ సీన్ కృష్ణమ్మ సినిమాలో ఉంది. సినిమాలో హీరోకు ఓ పగ ఉంటుంది. ఆ పగను మరిచిపోకుండా ఉండేందుకు మొక్కను పెంచుతాడు. అలా మొక్కతో పాటు హీరో పగ పెరుగుతుంది. ఇలా ఓ కొత్త సీన్ ను కృష్ణమ్మ సినిమాలో చూపించారు.

"కృష్ణమ్మ సినిమాలో అది చాలా స్ట్రాంగ్ ఎమోషన్ ఉన్న సీన్. పగను మర్చిపోతామేమో అని ఒక మొక్క పెంచుకుంటారు సినిమాలో. ఆ మొక్క ఎంత పెరిగితే పగ అంత పెరుగుతుంది. మొక్క నుంచి వృక్షం వరకు పగ పెరిగే విధానాన్ని డైరెక్టర్ చాలా బాగా రాసాడు. అది సినిమాలో చూస్తేనే చాలా బాగుంటుంది. ఇలాంటి కొత్త సీన్స్ సినిమాలో చాలా ఉన్నాయి."

ఇలా కృష్ణమ్మ సినిమాపై అంచనాలు పెరిగేలా మాట్లాడాడు సత్యదేవ్. కెరీర్ లో రకరకాల పాత్రలు పోషించిన ఈ నటుడు, కృష్ణమ్మ సినిమా కోసం మాత్రం నటనపరంగా కొంచెం కష్టపడ్డానని చెబుతున్నాడు.

"సినిమాలో నా పాత్ర పేరు వించిపేట భద్ర. ఈ క్యారెక్టర్ కోసం విజయవాడ స్లాంగ్ నేర్చుకున్నాను. ఆ బాడీ లాంగ్వేజ్ కోసం చాలా కష్టపడ్డాను. కథలో కొన్ని సీన్స్ లో 40 ఏళ్ళ వ్యక్తిగా కనిపించాలి. అదే పొగరు, పగ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ చేయడం కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది."

Readmore!

రీసెంట్ గా సరైన సక్సెస్ అందుకోలేకపోయిన ఈ హీరో.. గాడ్ ఫాదర్, రామసేతులో చేసినలాంటి మంచి పాత్రలు దొరికితే, తప్పకుండా చేస్తానంటున్నాడు. త్వరలో అలాంటి ఓ మంచి పాత్రతో తమిళ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు.

Show comments

Related Stories :