సిఎమ్ రమేష్ ఎన్నికల ఖర్చు ఎంత?

రాజకీయ వర్గాల్లో డిస్కషన్ లో వున్న పాయింట్లో ఇది ఒకటి. అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న సిఎమ్ రమేష్ ఎన్నికల కోసం ఎంత ఖర్చుచేసి వుంటారు అన్నదే. దీని మీద రకరకాల గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.

తన పరిధిలో ఏడు నియోజక వర్గాల అభ్యర్ధులకు తలా పది కోట్లు ఖర్చుల కోసం ఇచ్చారనే వార్తలు లోకల్ గా వినిపిస్తున్నాయి. ఓ సినిమా గేయ రచయితకు కోటి రూపాయల ప్యాకేజ్ ఇచ్చి పాటలు తయారు చేయించుకుని, ప్రచారం చేయించుకున్నారని మరో టాక్. ఇక హెలికాప్టర్లకు బోలెడు ఖర్చు. నాగబాబు కోసం చేబ్రోలు నుంచి అనకాపల్లికి అంటే వంద కిలో మీటర్ల దూరానికి హెలికాప్టర్ పంపారు.

జనసేన అనకాపల్లి సీటును త్యాగం చేసినందుక ప్రతిగా పిఠాపురం కోసం కొంత ఖర్చును సిఎమ్ రమేష్ భరించారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆయన స్వంత ప్రచారం, కార్లు, కార్యకర్తలు, డబ్బులు ఇవన్నీ కలిపి ఎంత అయి వుంటాయో అన్నది ఊహలకే వదిలేయాలి. మొత్తం మీద 100 నుంచి రెండు వందల కోట్లు ఖర్చయి వుంటుందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

అయితే విరాళాలు కూడా గట్టిగానే వచ్చాయని, అనకాపల్లి నియోజక వర్గం మొత్తం మీద పరిశ్రమలు దండిగా వున్నాయి. సెజ్ లు వున్నాయి. ఇలా చాలా వున్నాయి. వాటి అన్నింటి నుంచి కాస్త గట్టిగానే విరాళాలు వసూలు జరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అవి ఎంత వరకు నిజమో తెలియదు కానీ భాజపా అభ్యర్ధి కావడం, కేంద్రంలో మంచి సంబంధాలు వుండడం వల్ల బాగానే విరాళాలు వచ్చాయని టాక్ వుంది.  Readmore!

Show comments

Related Stories :