అక్క‌డ టీడీపీ అభ్య‌ర్థిని సాంతం నాకేశారా!

ఆఖ‌రి నిమిషంలో డ‌బ్బు సంచుల‌తో దిగార‌నే అభ్య‌ర్థులు అప్ప‌టి వ‌ర‌కూ ఇన్ చార్జిలుగా వ్య‌వ‌హ‌రించిన వారికి బాధ‌ను మిగిల్చినా, క్యాడ‌ర్ మాత్రం వారి విష‌యంలో భారీ అంచ‌నాల‌ను పెట్టుకుంది. డ‌బ్బు మాత్ర‌మే వారి అర్హ‌త కాబ‌ట్టి.. వారు భారీగా వెద‌జ‌ల్లుతార‌ని క్యాడ‌ర్ లెక్కేసింది! ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలో ఒక చోట ఆఖ‌రి నిమిషంలో ఒక తెలుగుదేశం సొంత సామాజిక‌వ‌ర్గం వ్య‌క్తి ధ‌నికుడు అనే లెక్క‌ల‌తో టికెట్ పొందాడు!

అప్ప‌టి వ‌ర‌కూ ఒక చౌద‌రి గారే ఇన్ చార్జిగా వ్య‌వ‌హ‌రించినా, ఆ చౌద‌రిని కాద‌ని ఇంకో డ‌బ్బున్న చౌద‌రిని చంద్ర‌బాబు బ‌రిలోకి దించారు! ఆయ‌న రావ‌డంతో పాత చౌద‌రి కాస్త కినుక వ‌హించారు! అయితే.. ఆ చౌద‌రిని ఈ చౌద‌రి స‌ముదాయించ‌డ‌ట‌! ప‌ది కోట్ల రూపాయ‌ల రొక్కాన్ని క‌ట్టి.. వ్య‌తిరేకంగా ప‌ని చేయ‌క‌పోతే చాల‌నే కండిష‌న్ తో ఒప్పందం కుదుర్చుకున్నార‌ట‌! అలా పాత ఇన్ చార్జిని స‌ముదాయించ‌డానికే ప‌ది కోట్లు పోయాయ‌ట‌!

ప‌నిలో ప‌నిగా జ‌న‌సేన అంటూ మ‌రొక‌రు వ‌సూళ్ల‌కు వ‌చ్చార‌ట‌! నియోజ‌క‌వ‌ర్గంలో బ‌లిజ‌ల ఓట్లు ఉన్నాయి. కాబ‌ట్టి జ‌న‌సేన స‌హ‌కారం కోసం అంటూ ఇంకో ప‌ది కోట్లు వెచ్చించాడ‌ట స‌ద‌రు అభ్య‌ర్థి! ఇలా టికెట్ ఆశావ‌హుల విష‌యంలోనే ఇర‌వై కోట్ల రూపాయ‌లు పోయాయ‌ట‌! ఆ పై వాళ్లూ వీళ్లూ అంటూ నియోజ‌క‌వ‌ర్గంలో క‌మ్మ వాళ్లే అభ్య‌ర్థి చుట్టూ మూగార‌ట‌! వాళ్లు.. ఒక్కోరూ దానికి దీనికి అంటూ కోట్ల రూపాయ‌ల‌ను దండుకున్నార‌ని వినికిడి!

క‌ట్ చేస్తే.. ఓట‌ర్ల‌కు నోటు పంచే స‌మ‌యానికి.. స‌ద‌రు అభ్య‌ర్థికి చుక్క‌లు క‌నిపిస్తూ ఉన్నాయ‌ట‌! కోట్ల రూపాయ‌లు తీసుకుని క‌మ్మ వాళ్లే స‌ద‌రు చౌద‌రిని నాకేశార‌ట! దీంతో ఓటుకు భారీగా ఇస్తాడ‌నే అంచ‌నాలున్న స‌ద‌రు అభ్య‌ర్థి సొంత వాళ్లు చేష్ట‌ల‌తో నిట్టూరుస్తున్నాడ‌ట‌! ఓటుకు రెండు మూడు వేల రూపాయ‌లు అయినా పంచాల‌నే లెక్క‌ల‌ను మొద‌ట్లో వేసుకున్నా.. సొంత వాళ్లే సాంతం నాకేయ‌డంతో ఓటుకు వెయ్యే పంచి మ‌మ అనిపించుకుంటున్నాడ‌ట! ఎన్నిక‌ల ఖ‌ర్చు అంటే ప్ర‌చారానికో, ఓటుకు నోటుకో కాకుండా.. నాయ‌కుల స‌ముదాయింపుకే కోట్ల రూపాయ‌లు పెట్టి స‌ద‌రు అభ్య‌ర్థి పోలింగ్ కు ముందే నిట్టూరుస్తున్నాడ‌ని స్థానికంగా టాక్! Readmore!

Show comments

Related Stories :