పోరాటం ఆపేస్తున్నారా?

ఆరంభింపరు నీచ మానవులు.. అని గతంలో ఓ పద్యం వుంది. అస్సలు ఆరంభించని వారు నీచులు.. మధ్యలో వదిలేసేవారు మధ్యములు.. చివరి వరకు పోరాడేవారు ఉత్తములు అన్నది విషయం. ప్రస్తుతం జరుగుతున్న ఆంధ్ర ఎన్నికల్లో ఈ చిత్రం కూడా చోటు చేసుకుంటోంది.

సర్వేలు, పత్రికల వార్తలు, గడబిడ అన్నీ చూసి ఇంకెందుకులే అని నీరసపడిపోతున్న కేండిడేట్ లు కూడా వుంటున్నారట. ఈ పార్టీ, ఆ పార్టీ అని కాదు, పలు చోట్ల ఎన్నికల వేళ నీరసపడిపోతున్న కేండిడేట్ లు వున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

నామ్ కే వాస్తే ప్రచారం చేయడం, కిందకు డబ్బులు అందించకపోవడం వంటి సూనచలు కనిపిస్తుంటే ఆ అభ్యర్ధుల కార్యకర్తలు డీలా పడుతున్నారు. ఏం జరుగుతోంది అన్న చిన్న అయోమయానికి గురవుతున్నారు. ఇలాంటి సీన్లు గోదావరి జిల్లాల్లో కాస్త కనిపిస్తున్నాయని వార్తలు అందుతున్నాయి. ముఖ్యంగా ఎంపీ అభ్యర్ధులు ఇలాంటి వ్యవహారాలకు పాల్పడుతున్నారట.

ఎంపీలు ఖర్చు చేస్తారు కదా, తమకు కాస్త ఊరట వుంటుందనుకున్న ఎమ్మెల్యే అభ్యర్ధులు షాక్ అవుతున్నారు. తాము ఖర్చు చేసినా, చేయకున్నా ఎమ్మెల్యేలు ఎలాగూ చేస్తారని ఎంపీ అభ్యర్ధులు అనుకుంటున్నారు. Readmore!

ఇలా మొత్తం మీద కొన్ని చొట్ల మధ్యలోనే కాడి వదిలేస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా చేసే వాళ్ల ఏ పార్టీ వాళ్లయినా కావచ్చు. ఎంపీ అభ్యర్ధులు ఇలా మధ్యలో జారినా, వెనక్కు తగ్గినా అది ఎమ్మెల్యే అభ్యర్ధుల మీద కూడా ప్రభావం చూపించే అవకాశం వుంది. 

Show comments

Related Stories :