పిఠాపురంలో డబ్బుల కిరికిరి!

గత రెండు రోజులుగా పిఠాపురంలో డబ్బుల కిరి కిరి నడుస్తోంది. ఓటర్లకు డబ్బుల పంపిణీ బాధ్యతలు తెలుగుదేశం నాయకుడు వర్మకు అప్పగించడం వల్లే ఈ సమస్య వచ్చిందని జనసేన వర్గాల బోగట్టా.

విషయం ఏమిటంటే వైకాపా డబ్బుల పంపిణీ వ్యవహారాన్ని ఐప్యాక్ మనుషులు పర్యవేక్షించారు. అందువల్ల సమస్య కాలేదు. జనసేన పంపిణీ కార్యక్రమాన్ని లోకల్ మనుషులు కనుక వర్మ అండ్ కో కు అప్పగించారని తెలుస్తోంది. వర్మ గడప గడపకు వెళ్లి ఇవ్వరు కదా. ఏ ఏరియా మనుషులకు ఆ ఏరియా వారీగా అప్పగించారు.

అక్కడ తేడా కొట్టిందని, చేరాల్సిన రీతిగా డబ్బులు చేరలేదని నిన్నంతా హడావుడి జరిగింది. జనాలు నేరుగా తమ తమ ప్రాంతాలకు చెందిన జనసేన నాయకులకు ఫోన్ లు చేయడం, డబ్బులు అందలేదని ఫిర్యాదు చేయడం, ఇలా అయితే ఎన్నికల బాయ్ కాట్ చేస్తామని హెచ్చరించడం వంటివి జరిగాయి. కొంత వరకు సెట్ చేయడానికి ప్రయత్నించారు. ఇంకా సెట్ కాని ప్రాంతాలు వుండనే వున్నాయి.

ఈలోగా వైకాపా జనాలు హార్డ్ కోర్ జనసేన ప్రాంతాలు కొన్ని గుర్తించి, మూడు నుంచి అయిదు వేలు, పట్టుచీర పంపిణీ మొదలుపెట్టారు. దాంతో మళ్లీ అక్కడ కిరికిరి మొదలైంది. Readmore!

ఇలా పిఠాపురం ఎక్కడ మాటలు విన్నా అన్నీ ఈ డబ్బుల పంపిణీ చుట్టూ తిరుగుతున్నాయి. ఈసారి ఆంధ్ర అంతంటా ఓటుకు వెయ్యి అన్నది మినిమమ్ అయింది. ఎక్కడ చూసినా, వైకాపా దే డబ్బుల విషయంలో పైచేయిగా వుంది.

Show comments

Related Stories :