బ్రేకప్ పార్టీ.. ఆ హీరోయిన్ ఇప్పుడు సింగిల్

ఓవైపు కొంతమంది హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మరోవైపు ఇంకొంతమంది హీరోయిన్లు ప్రేమలో పడుతున్నారు. వీటితో పాటు బ్రేకప్స్ కూడా అదే రేంజ్ లో నడుస్తున్నాయి. తాజాగా ఈ బ్రేకప్ లిస్ట్ లోకి అనన్య పాండే చేరింది.

హీరోయిన్ అనన్య పాండే, నటుడు ఆదిత్య రాయ్ కపూర్ ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. ఆమధ్య ఇద్దరూ కలిసి గ్రీస్ వెళ్లి ఎంజాయ్ చేశారు కూడా. అంతేకాదు, కాఫీ విద్ కరణ్ షోలో కూడా అనన్య పాండే, తను డేటింగ్ చేస్తున్నట్టు పరోక్షంగా వెల్లడించింది.

ఇలా ఏడాదిన్నరగా చెట్టపట్టాలేసుకొని తిరిగిన ఈ ప్రేమపక్షులు ఎవరిదారి వాళ్లు చూసుకున్నారు. అవును.. అనన్య పాండే, ఆదిత్య రాయ్ విడిపోయినట్టు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

మొన్నటికిమొన్న అనన్య పాండే తన ఇంట్లో పెద్ద పార్టీ ఇచ్చింది. ఆ పార్టీకి అనన్య ఫ్రెండ్స్ తో పాటు, కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు కూడా వచ్చారు. దానికి ఆదిత్య రాయ్ కూడా హాజరయ్యారు. ఇంతకీ అదేంటో తెలుసా.. బ్రేకప్ పార్టీ. అలా స్నేహితులందరికీ పెద్ద పార్టీ ఇచ్చి మరీ వీళ్లిద్దరూ విడిపోయారు.

Readmore!

లైగర్ తో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది అనన్య పాండే. అయితే ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఆమె మళ్లీ సౌత్ లో కనిపించలేదు. ప్రస్తుతం హిందీలో ఆమె 2 సినిమాలు చేస్తోంది.

Show comments

Related Stories :