వరలక్ష్మి ఖాతలో మరో హిట్ శబరి

వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన 'శబరి'కి ముందుగా అనుకున్న బడ్జెట్ కంటే తర్వాత ఎక్కువైందని దర్శకుడు అనిల్ కాట్జ్ అంగీకరించాడు. క్వాలిటీ కోసం, పరిస్థితుల ప్రభావం వల్ల బడ్జెట్ పెరిగిందన్నారు. మే 3న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్రకథ, టైటిల్, బడ్జెట్, వరలక్ష్మి గురించి ఆయన చెప్పిన విశేషాలు ఇవి.  ప్రాణానికి మించిన ప్రేమ ఒక్కోసారి ప్రాణం తీసేంత ద్వేషంగా మారుతుందనేది 'శబరి' కోర్ కాన్సెప్ట్. లోకంలో తల్లి ప్రేమను మించిన స్వచ్ఛమైన ప్రేమ నాకు కనిపించలేదు. అందుకని, తల్లి కుమార్తెల అనుబంధం నేపథ్యంలో ఈ పాయింట్ రాశాను. 

కథ రాశాక వరలక్ష్మి అయితే పర్ఫెక్ట్ ఛాయస్ అని ఫీలయ్యాను. ఆవిడకు కథ చెబితే సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చేశారు. వరలక్ష్మిని సెలెక్ట్ చేసుకోవడం వెనుక చిన్న స్వార్థం కూడా ఉంది. ఆవిడ ఆఫ్ స్క్రీన్ పర్సనాలిటీ చూశా. నేను చెప్పాలనుకున్న పాయింట్‌తో కనెక్ట్ అవుతారనిపించింది. ఆర్టిస్ట్ ఎవరైనా కథను నమ్మితే స్క్రీన్ మీద నటన మరింత బావుంటుంది. అందుకే, ఆవిడను అప్రోచ్ అయ్యా.ఇండియాలో ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిలిమ్స్ చేయగల సత్తా ఉన్న ఆర్టిస్టులు కొంత మంది ఉన్నారు. ఆ కొందరిలో ఎటువంటి ఎమోషన్ అయినా చేయగల ఆర్టిస్ట్ వరలక్ష్మీ శరత్ కుమార్.

కుమార్తెను కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్లే పాత్ర వరలక్ష్మి పోషించారు. ఆ ప్రేమ, పోరాటం, ఆవేదన... అన్నిటినీ ఆవిడ చక్కగా పలికించారు. సినిమాలో ఆమె క్యారెక్టర్ పేరు శబరి కాదు, కానీ ఆ టైటిల్ ఎందుకు పెట్టానంటే... రాముడు కన్న కొడుకు కాకపోయినా ఆయన మీద ఎంతో ప్రేమ, వాత్సల్యం శబరి చూపించారు. ఆ ప్రేమ మన సినిమాలో ప్రధాన పాత్రకు ఉంది. సంస్కృతంలో శబరి అంటే ఆడ పులి అని అర్థం. బిడ్డ కోసం తల్లి చేసే పోరాటం మన సినిమాలో ఉంది. అందుకే ఆ టైటిల్ పెట్టాను. 

వరలక్ష్మి మాకు డేట్స్ ఇచ్చిన టైంలో విశాఖ వెళితే నేను కథలో రాసుకున్న వాతావరణం లేదు. వెదర్ కోసం వెయిట్ చేస్తే మళ్లీ డేట్స్ ఇచ్చేసరికి ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది. అందుకని, కొడైకెనాల్ వెళ్లాం. దానివల్ల కొంత బడ్జెట్ పెరిగినా క్వాలిటీ సినిమా ప్రేక్షకులకు అందించాలని మా నిర్మాత మహేంద్రనాథ్ ఎంతో సపోర్ట్ చేశారు. హనుమాన్ మూవీకి బడ్జెట్ ఎక్కువైందని దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పారు. విజయం సాధించి లాభాలు వచ్చాయి కదా! మా సినిమా సైతం అలా విజయం సాధిస్తుందని నమ్ముతున్నా. 

Readmore!

థియేటర్లలో ప్రేక్షకులకు 'శబరి' మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని నా విశ్వాసం. కేవలం ప్రేక్షకులను భయపెట్టాలని చూస్తే వర్కవుట్ అవ్వదు. కథతో పాటు ట్రావెల్ చేసేలా ఎమోషన్స్ కూడా ఉండాలి. మా సినిమాలో మంచి కథతో పాటు బలమైన భావోద్వేగాలు ఉన్నాయి. ప్రేక్షకులు తప్పకుండా థ్రిల్ అవుతారు.

Show comments

Related Stories :