బ‌లిజ‌ కానిస్టేబుల్ వ‌ద్దు.. క‌మ్మ వాడే కావాలి!

జ‌న‌సేన మ‌ద్ద‌తు ద్వారా తెలుగుదేశం పార్టీ నెగ్గింద‌ని ఆ పార్టీ సానుభూతి ప‌రులు అంటారు! జ‌న‌సేన మ‌ద్ద‌తే లేక‌పోతే తెలుగుదేశం పార్టీ కి విజ‌యావ‌కాశాలు లేవంటారు! అయితే.. ఈ విష‌యంపై తెలుగుదేశం పార్టీ వాళ్లు ఎలా స్పందిస్తారో వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు! తెలుగుదేశం విజ‌యంలో జ‌న‌సేన క్రెడిట్ ఇవ్వ‌డానికి వారు ఎప్పుడూ ఒప్పుకోరు! అయితే ఇప్ప‌టికైతే తెలుగుదేశం- జ‌న‌సేన‌ల న‌డుమ ఈ ర‌క‌మైన వాదుల‌ట లేదు!

ఇంకా హ‌నీమూన్ పిరియ‌డ్ కొన‌సాగుతూ ఉంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ కు మంత్రి ప‌ద‌వి, డిప్యూటీ సీఎం హోదాతో జ‌న‌సేన క్లౌడ్ నైన్ లో ఉంది. ప‌వ‌న్ వీరాభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. కూట‌మి ప్ర‌భుత్వంపై ఎన‌లేని విశ్వాసంతో ఉన్నారు! ఇక తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు కూడా ఇంకా గిల్లడం లేదు! హ‌నీమూన్ పిరియ‌డ్ ఆ స్థాయికి త‌గ్గ‌ట్టుగా కొన‌సాగుతూ ఉంది.

మ‌రి పైకి క‌నిపించే సంగ‌తి ఇలా ఉంటే.. కూట‌మి ప్ర‌భుత్వం రాగానే ఎక్క‌డి వారు అక్క‌డ త‌మ త‌మ అవ‌కాశాల‌ను చూసుకుంటూ ఉన్నారు. బ‌దిలీలు, ఉద్యోగాలు, అవ‌కాశాలు, కాంట్రాక్టులు.. వీట‌న్నింటికీ కొత్త ప్ర‌భుత్వం రాగానే కొత్త ఆశ‌లు, ఆశ‌యాలు ఏర్పడుతూ ఉంటాయి, ఎవ‌రి అవ‌కాశాల‌ను వారు ఉప‌యోగించుకునే ప్ర‌య‌త్నం చేస్తూ ఉంటారు. ఇలాంటి క్ర‌మంలో రాయ‌ల‌సీమ ప్రాంతంలో ఒక కానిస్టేబుల్ కూడా తాము అభిమానించే ప్ర‌భుత్వం ఏర్పాటు అయ్యింది కాబ‌ట్టి, చాన్నాళ్లుగానే త‌ను ఆశించిన బ‌దిలీని కోరుతూ త‌మ స్థానిక ఎమ్మెల్యేను ఆశ్ర‌యించిన‌ట్టుగా తెలుస్తోంది.

ఆ కానిస్టేబుల్ చాలా కాలంగా ప‌క్క జిల్లాలో ప‌ని చేస్తూ ఉన్నాడ‌ట‌! ఇప్పుడు సొంత జిల్లా బ‌దిలీ ప్ర‌య‌త్నంలో ఉన్నాడ‌ట‌! దీని కోసం స్థానిక ఎమ్మెల్యేను క‌లిసి.. ఇప్పుడు పోస్టింగ్ అవ‌కాశాల్లో ఆయ‌న‌కు అంగ‌ర‌క్ష‌కుల అవ‌కాశం కూడా ఉంద‌ని, త‌ను ఎలాగూ కూట‌మి ప్ర‌భుత్వం మ‌ద్ద‌తుదారును కాబ‌ట్టి.. త‌న‌కు గ‌న్ మెన్ అవ‌కాశం ఇప్ప‌టించాల‌ని, త‌ద్వారా ప‌క్క జిల్లా నుంచి సొంత జిల్లా కేంద్రానికి వ‌చ్చి ప‌ని చేసుకునే అవ‌కాశం ఇవ్వాలంటూ వెళ్లి క‌లిశాడ‌ట‌! తెరిప‌రా చూసిన స‌ద‌రు ఎమ్మెల్యే.. కులం ఏమిటో క‌నుక్కొన్నాడ‌ట‌! స‌ద‌రు కానిస్టేబుల్ తాము బ‌లిజ‌ల‌మ‌ని చెప్పాడ‌ట‌! Readmore!

అక్క‌డే తేడా కొట్టిన‌ట్టుగా ఉంది. గ‌న్ మెన్ ప్లేస్ కు త‌ను త‌మ కుల‌స్తుల‌నే ఎంచుకుంటాను త‌ప్ప బ‌లిజ‌లు త‌న‌కు వ‌ద్ద‌ని మొహం మీదే చెప్పేశాడ‌ట స‌ద‌రు ఎమ్మెల్యే! క‌మ్మ కుల‌స్తుడు అయిన ఎమ్మెల్యే గారు.. బ‌లిజ‌ను గ‌న్ మ్యాన్ గా తీసుకోవ‌డానికి నిర్మొహ‌మాటంగా నో చెప్ప‌డ‌మే కాకుండా, మొహం మీదే చెప్పి పంపించాడ‌ట‌! కూట‌మి ప్ర‌భుత్వం రాగానే ఇది జ‌న‌సేన మ‌ద్ద‌తు ఉన్న ప్ర‌భుత్వం అనో, బ‌లిజ‌ల ఓట్లు కూడా కీల‌కంగా ప‌డ్డాయి క‌దా అనే లెక్క‌ల‌తోనో.. ఎమ్మెల్యేల ద‌గ్గ‌రికి ఎగేసుకు వెళ్లిన ఒక జ‌న‌సేన వీరాభిమానికి క‌లిగిన అనుభ‌వం ఇది!

తెలుగుదేశం విజ‌యంలో జ‌న‌సేన మ‌ద్ద‌తు నిస్సందేహంగా కీల‌క‌మే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40 శాతం ఓట్లు వ‌స్తే, టీడీపీకి 46 శాతం ఓట్లు వ‌చ్చాయి, అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు ద‌క్కితే టీడీపీకి 135 సీట్లు ద‌క్కాయి! తేడా ఏమిటి అంటే.. జ‌న‌సేనే! ఆరు శాతం ఓట్ల తేడాతో ఏకంగా 124 సీట్ల‌ను టీడీపీ అద‌నంగా గెలుచుకుందంటే.. అక్క‌డి మంత్రం జ‌న‌సేన‌దే! అయితే.. ఇలాగ‌ని తెలుగుదేశం నుంచి జ‌న‌సైనికులు ఎక్కువ ఎక్స్ పెక్ట్ చేస్తే మాత్రం.. అక్క‌డే అస‌లు క‌థ మొద‌ల‌వుతుందని పై ఉదంతం చాటి చెబుతూ ఉంది!

Show comments

Related Stories :