సజ్జలను నెమ్మదిగా లూప్ లైన్లోని నెడుతున్నారా?

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలను నిర్వర్తించిన అయిదేళ్ల పదవీకాలంలో, ఆ పదవికి తగిన హోదాతో అధికారం వెలగబెట్టింది, మీడియా ముందు వివరణలు ఇచ్చినది.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి. రాష్ట్రంలో ఏదైనా ముఖ్యమైన సంఘటన జరిగినా, రాజకీయ పరిణామం జరిగినా.. రాష్ట్ర ప్రజలు యావత్తూ ముఖ్యమంత్రి జగన్ స్పందిస్తారు, మీడియాతో మాట్లాడతారు, వివరణ ఇస్తారు అనుకునే సమయంలో.. సజ్జల తెరమీదికి వస్తారు. ముఖ్యమంత్రి మాటలను ప్రజలు కోరుకున్న ప్రతి సందర్భంలోనూ ఆయనే వచ్చి వివరణ ఇస్తుంటారు.

పైగా ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో జగన్ ప్రెస్ మీట్ లో మాట్లాడడానికి కాస్త ఇబ్బంది పడే వ్యక్తి అనే సీక్రెట్ ను కూడా సజ్జల చెప్పేశారు. అధికారంలో ఉన్న రోజుల్లో మాత్రమే కాదు. అధికారం నుంచి దిగిపోయిన తర్వాత.. ఎమ్మెల్యే అభ్యర్థులందరితో జగన్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించినప్పుడు కూడా సజ్జల రామక్రిష్ణా రెడ్డి, జగన్ వెనకాలే ఉండి వ్యవహారాలను నడిపించడం ప్రజలు గమనించారు.

రాజకీయ ప్రత్యర్థులు అయిదేళ్ల పాటు సజ్జలను సకలశాఖల మంత్రి అని ముద్దుగా పిలుచుకున్నారు గానీ.. నిజానికి ఆయన డీఫ్యాక్టో సీఎం అనదగినంతగా చెలరేగిపోతూ ఉండేవారు. అలాంటి సజ్జలను నెమ్మదిగా సైడ్ లైన్ చేస్తున్న్టట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే.. చాలా కీలకమైన విషయాల్లో.. అంటే ఈ విషయంలో జగనే బయటకు వచ్చి మాట్లాడాలి గానీ, ఆయన రారు గనుక, ఆయన తరఫున సజ్జల డైరక్టుగా వచ్చి వివరణ చెబుతారు అని ప్రజలు ఊహించే సమయంలో.. ఇప్పుడు ఆయన రావడం లేదు. ఇతర నాయకులను వైసీపీ ముందుకు తెస్తోంది.

సజ్జలకు ప్రయారిటీ తగ్గుతున్నదా అనే అనుమానం ప్రజల్లో కలుగుతోంది. ఓటమిని అంచనా వేయడంలో జగన్ అలర్ట్ కాకుండా, పార్టీని సేఫ్ జోన్ లోకి తీసుకువెళ్లకుండా.. ఈ ప్రధాన సలహాదారు సజ్జల ఇచ్చిన ఫీడ్ బ్యాక్ కారణం అనే వాదన పెరుగుతోంది. ప్రస్తుతం కీలక విషయాల్లోకూడా మీడియా ముందుకు రానివ్వడం లేదు. Readmore!

జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా.. ఆయన భద్రత కోసం 986 మంది పోలీసులను వాడుకున్నారంటూ తెలుగుదేశం అనుకూల పత్రికలు ఒక కథనాన్ని ప్రకటించాయి. అది డైరక్టుగా జగన్ మీదనే ఎటాక్! జగన్ మాట్లడాలి లేదా సాధారణంగా సజ్జల మాట్లాడుతారు. కానీ..పేర్నినాని మాట్లాడుతున్నారు. ఫేక్ న్యూస్ ప్రచారంలో పెడుతున్నారని ఆయన ధ్రువీకరిస్తున్నారు.

మొత్తానికి ఇంపార్టెంట్ విషయాల్లో కూడా మీడియా ముందుకు రాకపోవడాన్ని లోతుగా గమనిస్తే.. సజ్జలను లూప్ లైన్లో పెడుతున్నారేమో అనే అభిప్రాయమే కలుగుతోంది.

Show comments

Related Stories :