పెన్షన్ల సక్సెస్ స్టోరీ వెనుక అసలు సీక్రెట్ ఇదే!

పెన్షన్ల పంపిణీ వ్యవహారాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా చాలా సఫలవంతంగా నిర్వహించింది. జులై 1న 94 శాతం మందికి పైగా లబ్ధిదారులకు పెన్షన్లు అందజేయడం ద్వారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రికార్డు సృష్టించింది.

చంద్రబాబు నాయుడు పెనుమాక గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని తన స్వహస్తాలతో ప్రారంభించగా.. అన్ని నియోజకవర్గాలలోనూ పార్టీ ఎమ్మెల్యేలు పెన్షన్లు పంపిణీ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇదంతా బాగానే ఉంది. కానీ వాలంటీర్లను దూరం పెట్టి మరీ సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ల పంపిణీ చేయడం వెనుక బాబు సర్కార్ ఒక సీక్రెట్ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

దీని ద్వారా రెండు అంశాలను లక్ష్యిస్తున్నారు. ఒకటి- ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో వాలంటీర్లను ఎన్నికల సంఘం దూరం పెట్టిన తర్వాత, సచివాలయ ఉద్యోగుల ద్వారా లబ్ధిదారులు వేళ్ళకు పింఛన్లు చేర్చలేదు అనే కారణం చూపించి జగన్ ప్రభుత్వం మీద బురద చల్లడం. రెండు- రాష్ట్రంలోని వాలంటీర్ల సంఖ్యను సగానికి సగం కోత పెట్టడం.

కీలకంగా గమనిస్తే వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో పొందుతూ వచ్చిన ఐదు వేల రూపాయలు వేతనాన్ని రెట్టింపు చేసి పది వేలుగా అందిస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆ హామీ అమలు చేయడానికి వీలుగా మొత్తం వాలంటీర్ల సంఖ్యలో సగం చేస్తే- ప్రభుత్వానికి ఒక్క పైసా భారం పడకుండా వాగ్దానం నెరవేర్చినట్లుగా ఉంటుందని వ్యూహాన్ని చంద్రబాబు ఎంచుకున్నారు. Readmore!

రాష్ట్రంలో 2.6 లక్షల మంది వాలంటీర్లు ఉండగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో వారి ద్వారా మాత్రమే పెన్షన్ల పంపిణీ జరిగేది. ఇప్పుడు కేవలం 1.3 లక్షల సచివాలయ ఉద్యోగులతోనే ఈ పని పూర్తి చేసినట్లుగా చంద్రబాబు ప్రభుత్వం నొక్కివక్కాణిస్తోంది. ఈ గణాంకాలన్నీ వారు కోరుకున్న పనిని గుట్టుచప్పుడు కాకుండా పూర్తి చేయడం కోసమే విడుదల చేస్తున్నట్లుగా అర్థమవుతోంది.

రాష్ట్రంలో ఉన్న 2.6 లక్షల మంది వాలంటీర్లలో 60 వేలకు పైగా ఇప్పటికే రాజీనామా చేశారు. మిగిలిన వారిలో కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సన్నిహితంగా ఉండే వాలంటీర్లను ఇంకో 70 వేల మందిని ఏరివేసి తొలగించడానికి చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. వాళ్లందరినీ తొలగించగా తమ పార్టీకి అనుకూలంగా ఉండే 1.3 లక్షల మందిని మాత్రం ఆ బాధ్యతలలో ఉంచి వారికి వేతనాలు పెంచి వారి ద్వారా పెన్షన్లు పంపిణీ చేపట్టబోతున్నారు.

ఈ కార్యక్రమం జరగడానికి ఆమాత్రం వాలంటీర్లు సరిపోతారని నిరూపించడం కోసమే సచివాలయ ఉద్యోగుల ద్వారా జులై పెన్షన్లను ఇప్పించినట్లుగా అంచనా వేస్తున్నారు. పైగా మిగిలి ఉన్న వాలంటీర్లలో వైసిపి వారు ఎవరో.. తమ వారు ఎవరో తెలియక ఏరివేత కార్యక్రమం ఆలస్యం అవుతుంది కాబట్టి, అప్పటిదాకా సచివాలయ ఉద్యోగులతో చేయిస్తారని కూడా అంటున్నారు.

Show comments

Related Stories :