కల్కికి అదనపు రేట్లు

ఈ ఏడాది టాలీవుడ్ కు ఎలా వుందో కానీ ఎగ్జిబిటర్లకు మాత్రం అంత బాలేదు. ఓ పద్దతిగా సినిమాలు రావడం లేదు. జనాలు కూడా థియేటర్ కు రావడం తగ్గించేసారు. అదే టైమ్ లో ఎన్నికల ప్రచారం, ఎన్నికల నిర్వహణ, లెక్కింపు ఇలా మొత్తం మీద సినిమాలకు జనం దూరం అయ్యారు. జనవరి నుంచి అప్పుడో సినిమా.. అప్పుడో సినిమా తప్ప మంచి కలెక్షన్లు కళ్ల చూసిన సినిమాలు ఎక్కువ లేవు. చాలా సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా అసలు ఓపెనింగ్ కూడా సరిగ్గా తెచ్చుకోలేదు.

ఇలాంటి టైమ్ లో ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబినేషన్ కల్కి సినిమా వస్తోంది. ఎగ్జిబిటర్లు కాస్త ఊపిరి పీల్చుకుంటారు. కల్కి సినిమా తరువాత రెండు వారాలకు ఇండియన్ 2 వస్తోంది. అంటే దాదాపు సరైన టాక్ వస్తే ఈ రెండు సినిమాలు కలిసి నెల రోజులు థియేటర్లను ఆదుకుంటాయి.

ఇదిలా వుంటే నైజాంలో, ఆంధ్రలో అదనపు రేట్ల కోసం కల్కి మేకర్లు దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్రలో మల్టీ ఫ్లెక్స్ లు, సింగిల్ స్క్రీన్ లు ఏవైనా యూనిఫారమ్ గా వంద రూపాయల అదనపు రేటు కు అనుమతి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది.

అదే విధంగా నైజాంలో మల్టీ ఫ్లెక్స్ ల్లో 75 రూపాయలు, సింగిల్ స్క్రీన్లలో 100 రూపాయలు అదనపు రేటు కావాలని కోరినట్లు తెలుస్తోంది. Readmore!

ఈ రెండింటి మీద ఆయా ప్రభుత్వాల నుంచి నిర్ణయాలు వెలువడాల్సి వుంది. అలాగే కొన్ని రోజుల పాటు రోజుకు అయిదు ఆటల కోసం కూడా అనుమతి కోరారని బోగట్టా. తెల్లవారుఝామున ఒంటి గంట షో మీద ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. మరి ఎక్కడైనా ఫ్యాన్స్ షో లు, బెనిఫిట్ షో లు వుంటే లోకల్ గా అనుమతి కోరి తీసుకుంటారెేమో?

మొత్తం మీద థియేటర్లకు కళ వస్తోంది. థాంక్స్ టు కల్కి.

Show comments

Related Stories :