అటు కాపులు..ఇటు బిసి లు

జగన్ ను తక్కువ అంచనా వేసి 2019లో బోర్లా పడ్డారు తప్పితే, చంద్రబాబు తక్కువ వోరు కాదు. ఎత్తుగడలు మామూలుగా వుండవు. జగన్ కు వ్యతిరేకంగా సమస్త వర్గాలను ఏకం చేసి 2024 ఎన్నికల్లో విజయం సాధించడంలోనే ఆయన సమర్ధతం అర్థం అవుతుంది.

ఇప్పుడు ఆయన దృష్టి జగన్ ను అతగాడి పార్టీని మళ్లీ లేవకుండా చేయడం మీద వుంది. ఇది రెండు విధాలుగా. ఒకటి జగన్ కేసులు, ఆ వ్యవహారాల రూటు వుండనే వుంటుంది. ఇది కాక 2019లో జగన్ వెంట నిలిచిన బిసి లను, ఎస్సీలను అతగాడికి దూరం చేయడం. కాపులు ఎలాగూ పవన్ కళ్యాణ్ ద్వారా తమ వెంటే వుంటారు. వుంచుకోవాలి.

అందుకే చంద్రబాబు రెండు అంచెల వ్యూహం పన్నుతున్నట్లు కనిపిస్తోంది. పవన్ కు విపరీతమైన ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా కాపుల ఆదరణ సంపాదిస్తున్నారు. బిసి లకు పెద్ద పీట వేయడం ద్వారా అటు మార్గం సుగమం చేసుకుంటున్నారు. ఇన్నాళ్లూ బిసి వెలమల దగ్గర వున్న పార్టీ అధ్యక్ష పదవిని తీసుకుని యాదవులకు ఇచ్చారు. ఎస్సీలకు ఏకంగా హోం మంత్రి పదవి ఇచ్చారు.

చూస్తుంటే స్పీకర్ పదవిని క్షత్రియులకు ఇచ్చేలా వున్నారు. దాంతో అన్ని వర్గాలను సంతృప్తి పరిచినట్లు అవుతుంది. ఇదంతా ఓ స్కీము. అంతవరకు బాగానే వుంటుంది. నిజానికి జగన్ కూడా తక్కువేమీ చేయలేదు. బిసి లకు చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కాపులను మరీ నిరాదరించలేదు. ఇవ్వాల్సినంత ఇచ్చారు. అయినా ఓడారు. Readmore!

జనాలకు సంతృప్తి అనే సూచీ ఎప్పటికప్పుడు పైకి వెళ్తూనే వుంటుంది. ఎన్ని చేసినా ఏదో ఒక మూల అసంతృప్తి అనేది వుంటుంది. జగన్ పాలనలో పది పైసల అసంతృప్తి వుంటే మీడియా దాన్ని వంద పైసలు చేసింది. చంద్రబాబు పాలనలో అదే పది పైసల అసంతృప్తిని అస్సలు కనిపించనివ్వదు. అదే తేడా. అదే చంద్రబాబు అడ్వాంటేజ్.

Show comments

Related Stories :