యువి.. శిరీష్/దిల్ రాజు… అటు ఇటు?

యువి సంస్థ అధినేతలు వంశీ- విక్కీ- ప్రమోద్ వీరంతా శిరీష్/దిల్ రాజుకు బెస్ట్ ఫ్రెండ్స్. అలాగే బన్నీవాస్ కు కూడా. కలిసి సినిమాలు పంపిణీ చేసారు. వీరి సినిమాలు వారు, వారి సినిమాలు వీరు పంచుకున్నారు. కొన్ని చోట్ల కలిసి సంస్థలు ఏర్పాటు చేసారు. అంతా బాగానే వుంది.

కానీ ఇప్పుడు దారులు వేరవుతున్నట్లు కనిపిస్తోంది. యువి వంశీ/విక్కీ అంటే శిరీష్ మండి పడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణాలు ఏమున్నాయి తెరవెనుక అన్న సంగతి పక్కన పెడితే, ఎదురుగా మాత్రం యువి లేటెస్ట్ మూవీ భజే వాయువేగం నైజాం పంపిణీని మైత్రీ సంస్థకు అప్పగించడం కనిపిస్తోంది.

అసలే మైత్రీ-దిల్ రాజు/శిరీష్… ఉప్పు నిప్పులా వుంటాయన్నది ఇండస్ట్రీ టాక్. దీంతో ఆ సంస్థకు యువి సినిమాను ఇవ్వడం కాస్త ఆలోచించాల్సిన పాయింట్. ఇదిలా వుంటే యువి నిర్మిస్తున్న భారీ సినిమా ‘విశ్వంభర’ కూడా శిరీష్/దిల్ రాజు కు కాకుండా బయటకు ఇచ్చే ఆలోచనలో వున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఒకరిద్దరు బయ్యర్లకు కాపీ అమ్మకం ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇప్పుడు భజే వాయువేగం సినిమాకు ఎక్కువ థియేటర్లు అవసరం లేకపోవచ్చు. కానీ కావాల్సిన థియేటర్లకు కూడా శిరీష్ నుంచి ఇబ్బంది ఎదురుకాకతప్పదు. భవిష్యత్ లో విశ్వంభరకు కూడా ఇదే పరిస్థితి ఎదురు కావచ్చు. Readmore!

Show comments

Related Stories :