రష్మిక సమ్మర్ బ్యూటీ టిప్స్.. చాలా సింపుల్

చలికాలం వస్తే చర్మం పొడిబారిపోతుంది. అదే ఎండాకాలం వస్తే జిడ్డుకొట్టుకుపోతుంది. కాలానికి తగ్గట్టుగా మేకప్ మార్చాలి, చిన్న చిన్న టిప్స్ పాటించాలి. ఈ విషయంలో హీరోయిన్లు ముందుంటారు. ఇంత వేడిలో కూడా హీరోయిన్ రష్మిక మెరిసిపోతుంది. దీనికి కారణం తన సమ్మర్ బ్యూటీ టిప్స్ అంటోంది రష్మిక.

అలా అని ఆమె ఖరీదైన కాస్మోటిక్స్ జోలికి వెళ్లడం లేదు. కత్రినాకైఫ్, అనుష్క శర్మలా విదేశాల నుంచి కాస్మోటిక్స్ తెప్పించుకోదు. రష్మిక సమ్మర్ బ్యూటీ టిప్స్ చాలా సింపుల్. అమ్మాయిలంతా ఇట్టే ఫాలో అయిపోవచ్చు.

రాత్రి పడుకునే ముందు ఏదైనా కంపెనీకి చెందిన హైడ్రేటింగ్ క్లెన్సర్ తో ముఖం కడుక్కోమంటోంది రష్మిక. ముఖంపై ఉన్న మలినాలు, జిడ్డును తొలిగించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అదే టైమ్ లో తేమను కూడా నిలిపి ఉంచుతుంది.

ఇక ఉదయం లేచిన తర్వాత విటమిన్-సి ఉన్న ఏదైనా కంపెనీ మాయిశ్చరైజర్ ను వాడాలని, ఆ తర్వాత సన్ స్క్రీన్ లోషన్ పెట్టుకుంటే సరిపోతుందని చెబుతోంది. ఇలా చేస్తే ఆ రోజంతా ముఖం ఫ్రెష్ గా ఉంటుందని చెబుతోంది.

Readmore!

ఇలా తన సమ్మర్ బ్యూటీ టిప్స్ చాలా సింపుల్ అంటోంది రష్మిక. భోజనం విషయంలో కూడా తన టేస్ట్ ఏంటనేది ఇదివరకే వెల్లడించింది ఈ బ్యూటీ. సాంబార్ రైస్ ఉంటే చాలని, అందులో 2-3 కర్రీలు మిక్స్ చేసి ఒకేసారి లాగించేస్తానని అంటోంది. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన తనకు ఇలా సింపుల్ గా ఉండడమే ఇష్టం అంటోంది నేషనల్ క్రష్.

Show comments

Related Stories :