హనుమాన్ కు మరోసారి జై కొట్టిన ప్రేక్షకులు

సిల్వర్ స్క్రీన్ కు, స్మాల్ స్క్రీన్ కు మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది ఈమధ్య. వెండితెరపై సూపర్ హిట్టయిన సలార్ సినిమా టీవీల్లో అట్టర్ ఫ్లాప్ అయింది. థియేటర్లలో డిజాస్టర్ అయిన ఆదికేశవ సినిమా బుల్లితెరపై బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఇలా అంతా రివర్స్ లో సాగుతున్న టైమ్ లో హనుమాన్ సినిమా వచ్చింది.

తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్ సినిమా థియేటర్లలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీ ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడీ సినిమా బుల్లితెరపై కూడా సూపర్ హిట్టయింది.

జీ తెలుగు ఛానెల్ లో తొలిసారి ప్రసారమైన హనుమాన్ సినిమాకు ఏకంగా 10.43 రేటింగ్ రావడం విశేషం. నిజానికి ఈ స్థాయి రేటింగ్ ను అంతా ఊహించారు. ఎందుకంటే, ఇది భక్తిరస చిత్రం, పైగా చిన్నారులు, కుటుంబ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిన మూవీ. కాబట్టి అందరి అంచనాలకు తగ్గట్టే మంచి రేటింగ్ సంపాదించింది హనుమాన్ సినిమా.

ఇక జీ తెలుగు హనుమాన్ సినిమాకు పోటీగా స్టార్ మా ఛానెల్ లో అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ సినిమాను తొలిసారి టెలికాస్ట్ చేశారు. ఈ సినిమాకు 5 రేటింగ్ వచ్చింది. సుహాస్ సినిమాకు 5 టీఆర్పీ అంటే చెప్పుకోదగ్గ విషయమే.

Readmore!

Show comments

Related Stories :