మూవీ పబ్లిసిటీ విషయంలో రాజమౌళి ఆలోచన ఇది!

సినిమాను ఎంత కష్టపడి తీస్తాడో, ప్రచారాన్ని కూడా అదే స్థాయిలో ముందుకు తీసుకెళ్తాడు రాజమౌళి. అతడి సినిమాల పబ్లిసిటీ, దానికి సంబంధించిన ప్లానింగ్ అద్భుతంగా ఉంటుంది. ప్రచారం విషయంలో కూడా రాజమౌళి ది బెస్ట్. మరి సినిమా ప్రమోషన్ విషయంలో రాజమౌళి పాటించే ప్రాధమిక సూత్రం ఏంటి?

"సినిమాలకు సంబంధించి ఆర్థిక పరమైన అంశాల్లో నేను చొరవ చేసుకోను. నా గురించి నేను ఎక్కువగా ఊహించుకోను. అలా అని నన్ను నేను తక్కువగా కూడా చూసుకోను. నా తదుపరి చిత్రం వస్తోంది. దాని గురించి ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని నేను అనుకోను. అదే సమయంలో నా సినిమాను ఎవ్వరూ పట్టించుకోవట్లేదని కూడా అనుకోను. అంచనాల విషయంలో సరైన ఆలోచన విధానంతో ఉంటాను. నా దృష్టి మొత్తం కొత్త ప్రేక్షకులపై ఉంటుంది. కొత్త ఆడియన్స్ ను ఎలా ఎట్రాక్ట్ చేయాలి, వాళ్లను ఎలా థియేటర్లకు రప్పించాలనే అంశంపై ఎక్కువగా ఆలోచిస్తుంటాను. నా సినిమా పబ్లిసిటీ మొత్తం ఇదే పాయింట్ పై నడుస్తుంది."

ఈ క్రమంలోనే కొత్త విషయాలు నేర్చుకోవడానికి తను ప్రయత్నిస్తుంటానని, వాటిని సినిమా మేకింగ్ లో, ప్రచారంలో వాడుతుంటానని చెప్పుకొచ్చాడు రాజమౌళి. బాహుబలి-2 ప్రచారానికి ఒక్క పేపర్ యాడ్ ఇవ్వలేదని, ఏ వెబ్ సైట్ కు ప్రచారం కోసం డబ్బులు ఇవ్వలేదని అంగీకరించిన రాజమౌళి.. సినిమా, సినిమాకు ప్రచారం చేసే విధానంలో మార్పు ఉంటుందని తెలిపాడు.

"ఏ సినిమా చేసినా, ఆ మూవీ తీసే క్రమంలో చాలా నేర్చుకుంటాను. నేను సినిమా తీసే పద్ధతి ఇదే. దాని వల్ల నా నుంచి రాబోయే సినిమాలు మరింత కొత్తగా ఉంటాయి. నేను పని చేసే ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాను, దాన్ని నా సినిమాల్లో చూపిస్తూనే ఉంటాను. యానిమేషన్ సినిమా తీయాలనే కోరిక నాకు చాన్నాళ్లుగా ఉంది. ఈగతో ఆ కోరిక కొంచెం తీరింది."

Readmore!

త్వరలోనే మహేష్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు రాజమౌళి. దీనికి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమాతో కొత్త టెక్నాలజీని ఇండియాకు పరిచయం చేసే ఆలోచనలో ఉన్నాడట జక్కన్న.

Show comments

Related Stories :