తగ్గేదేలే.. ఈసారి మరింత కొత్తగా..!

పుష్ప సినిమాలో బన్నీ మేనరిజమ్ ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తగ్గేదేలే అంటూ బన్నీ చేసిన హడావుడి దేశం మొత్తం కాదు, ప్రపంచవ్యాప్తంగా హిట్టయింది. చివరికి క్రికెట్ మ్యాచుల్లో కూడా ఈ మేనరిజమ్ కనిపించిందంటే పుష్పరాజ్ హవా అర్థం చేసుకోవచ్చు.

అలా సూపర్ హిట్టయిన తగ్గేదేలే మేనరిజమ్ ను పుష్ప-2లో కూడా కొనసాగించారు. కాకపోతే ఈసారి ఇంకాస్త కొత్తగా ట్రై చేశారు. పుష్ప సినిమాలో ఒక చేత్తోనే గడ్డం నిమురుతూ డైలాగ్ చెప్పిన అల్లు అర్జున్, ఈసారి వెరైటీగా  రెండు చేతులతో మేనరిజమ్ ప్రదర్శించాడు. ఈరోజు రిలీజైన పుష్ప-2 టైటిల్ సాంగ్ లో ఫినిషింగ్ టచ్ ఇదే.

ఈ మేనరిజమ్ మాత్రమే కాదు, స్టెప్పుల్లో కూడా అదే వైవిధ్యం చూపించే ప్రయత్నం చేశారు. పుష్ప పార్ట్-1లో చెప్పు జారిపోయే స్టెప్ చాలా పాపులర్ అయింది. పార్ట్-2లో కూడా అలాంటి స్టెప్ ఉంది. కాకపోతే ఇంకాస్త అప్ గ్రేడ్ చేశారు. లిరికల్ వీడియోలో ఆ స్టెప్ చూపించారు. లిరికల్ సాంగ్ రిలీజ్ కు ఒక రోజు ముందు విడుదల చేయాలనుకున్న డాన్స్ బిట్ ఇదే. కానీ విడుదల చేయలేదు.

ఇక ఇదే సాంగ్ లో చాయ్ స్టెప్ కూడా ఉంది. టీ గ్లాస్ ను అటుఇటు తిప్పుతూ బన్నీ వేసిన డాన్స్ మూమెంట్ ఆకట్టుకుంది. ఏ స్టెప్ వేసినా అందులో పుష్పరాజ్ మార్క్ మిస్సవ్వకుండా చూసుకున్నారు. ఇలా ఈరోజు రిలీజైన పుష్ప-2 తొలి సాంగ్ వినడానికే కాదు, చూడ్డానికి కూడా బాగుంది.

Show comments

Related Stories :