పవన్ కల్యాణ్ సినిమా నుంచి క్రిష్ ఔట్..?

కొన్నాళ్ల కిందటి సంగతి. కల్యాణ్ రామ్ హీరోగా నటించిన డెవిల్ సినిమాకు అప్పటివరకు నవీన్ మేడారంను దర్శకుడిగా చెప్పుకొచ్చారు. ఒక రోజు సడెన్ గా డెవిల్ పోస్టర్ పై దర్శకుడి పేరు మిస్సయింది. దర్శకత్వ పర్యవేక్షణ అంటూ నిర్మాత తన పేరు వేసుకున్నాడు. కట్ చేస్తే, ఇప్పుడు అలాంటిదే సేమ్ సీన్ రిపీటైంది. కాకపోతే పూర్తిగా కాదు.

పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా హరిహర వీరమల్లు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఏళ్లుగా సాగుతోంది. ఎప్పటికి పూర్తవుతుందో కూడా తెలియదు. మొత్తానికి కిందామీద పడి టీజర్ కట్ చేశారు. 2వ తేదీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు పోస్టర్ కూడా వదిలారు. ఇక్కడే పెద్ద ట్విస్ట్ పడింది.

టీజర్ రిలీజ్ ఎనౌన్స్ మెంట్ పోస్టర్ లో దర్శకుడు క్రిష్ పేరు లేదు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పేరు వేశారు. నిర్మాతగా ఏఎం రత్నం పేరు ఉంది. ఇక హీరోగా పవన్ కల్యాణ్ పేరు కూడా ఉంది. 'ధర్మం కోసం యుద్ధం' అంటూ క్యాప్షన్ కూడా వదిలారు. ఇన్ని చేసిన మేకర్స్ దర్శకుడు క్రిష్ పేరును మాత్రం వేయలేదు.

ఇది అనుకోకుండా జరిగిందా లేక మేకర్స్ కావాలనే ఈ నిర్ణయం తీసుకున్నారా అనేది తెలియదు కానీ.. పోస్టర్ నుంచి క్రిష్ మాత్రం మాయమయ్యాడు. ఇలా జరగడం క్రిష్ కు కొత్తేంకాదు.

Readmore!

గతంలో మణికర్నిక అనే ప్రాజెక్ట్ నుంచి కూడా క్రిష్ ఇలానే తప్పుకున్నాడు. ఇప్పుడు పవన్ కల్యాణ్ ప్రాజెక్ట్ నుంచి కూడా ఆయన తప్పుకున్నాడా లేక పేరు వేయడం మరిచిపోయారా అనేది సస్పెన్స్. ప్రస్తుతం ఈ దర్శకుడు, అనుష్కతో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.

Show comments

Related Stories :