తమిళనాట శాతకర్ణి హంగామా షురూ

సంక్రాంతి కానుకగా వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ఇప్పుడు కోలీవుడ్ ఆడియన్స్ ను అలరించేందుకు సిద్ధమైంది. ఈ మూవీ తమిళ డబ్బింగ్ వెర్షన్ రెడీ అయింది. ఈరోజు సాయంత్రం 7 గంటలకు ట్రయిలర్ కూడా లాంచ్ చేయబోతున్నారు.

నిజానికి తెలుగుతో పాటు తమిళ్ లో ఒకేసారి ఈ సినిమాను విడుదల చేయాలని ప్రయత్నించారు. అయితే సమయాభావం వల్ల అప్పట్లో అది సాధ్యం కాలేదు. అలా వాయిదా పడిన “తమిళ శాతకర్ణి” త్వరలోనే అక్కడ విడుదలకానుంది.

బాహుబలి-2 సినిమా కోలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ అయింది. రజనీకాంత్, విజయ్, అజిత్ నటించిన హిట్ సినిమాల రికార్డుల్ని కూడా తిరగరాసింది. అలాంటి సక్సెస్ ఫుల్ వెంచర్ తర్వాత టాలీవుడ్ నుంచి రెడీ అయిన సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి.

బాహుబలి-2లా ఇది కూడా రాజుల కథ కావడం, గ్రాఫిక్స్ కూడా బాగుండడంతో సినిమా కచ్చితంగా కోలీవుడ్ లో ఆడుతుందనే నమ్మకంతో ఉన్నాడు దర్శకుడు క్రిష్.

Show comments