అల్లుడే నడిపిస్తారా?

విజయనగరం జిల్లా వైసీపీని ఎవరు నడిపిస్తారు అన్న చర్చ మొదలైంది. విజయనగరం అంటేనే బొత్స సత్యనారాయణ గుర్తుకు వస్తారు. ఆయన సీనియర్ పొలిటీషియన్. ఆయన కాంగ్రెస్ లో జిల్లా కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. ఆయన కాంగ్రెస్ లోనూ వైసీపీలోనూ కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. దానికి తగిన ప్రతిఫలంగా గౌరవప్రదమైన స్థానాన్ని అందుకున్నారు.

వైసీపీ దారుణ ఓటమి తరువాత బొత్స పెద్దగా కనిపించడం లేదు. హడావుడి కూడా చేయడం లేదు. అయితే విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ గా అధికార పదవిలో ఉన్న బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు వైసీపీ జిల్లా ప్రెసిడెంట్ గా కూడా ఉంటున్నారు. ఆయనే పార్టీని నడిపిస్తున్నారు.

రేపటి రోజున విజయనగరం జిల్లాలో వైసీపీకి ఆయనే ఆధారం అవుతారా అన్న చర్చ సాగుతోంది. బొత్స అయితే ప్రస్తుతానికి మౌనంగానే ఉన్నారు. ఆయన రాజకీయ పరిస్థితులను గమనిస్తున్నారా లేక వేరే ఏదైనా ఆలోచనలలో ఉన్నారా అన్న చర్చ కూడా సాగుతోఅంది.

బొత్స నీడన ఉంటూ వచ్చిన మేనల్లుడు ఇపుడు తనకంటూ సొంత పంధాను అవలంబించడానికైనా పార్టీలో ముందుకు వస్తారు అని అంటున్నారు. బొత్స కుటుంబంలో కొందరు సభ్యులు రాజకీయ తెర మీద కనిపిస్తారా కొనసాగుతారా అన్న చర్చ కూడా సాగుతోంది. Readmore!

Show comments

Related Stories :