ఖైదీ నంబర్ 150.. బుల్లితెరపై అట్టర్ ఫ్లాప్

రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తుందని అంచనా వేశారు. ఇప్పటికే క్రియేట్ అయిన రికార్డుల్ని తుడిచేస్తుందని బెట్ లు కట్టారు. కానీ చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150 సినిమా బుల్లితెరపై అట్టర్ ఫ్లాప్ మూవీగా నిలిచింది. మాటీవీలో గ్రాండ్ గా ప్రసారమైన ఈ సినిమాకు అతి తక్కువ టీఆర్పీలు వచ్చాయి.
 
చిరంజీవి రీఎంట్రీ మూవీగా భారీ పాపులారిటీ తెచ్చుకున్న ఖైదీ నంబర్ 150 సినిమాకు కేవలం 6.93 టీఆర్పీ వచ్చింది. అది కూడా రూరల్, అర్బన్ కలిపి వచ్చిన రేటింగ్ ఇది. మెగాస్టార్ సినిమాకు టీవీలో ఇంత తక్కువ రేటింగ్ వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఎలాంటి పోటీలేని టైం చూసి సినిమా వేద్దామని మాటీవీ చాలారోజులు వెయిట్ చేసింది. అలానే చేసింది కూడా. మిగతా ఛానెల్స్ తో కాంపిటిషన్ లేని టైమ్ లో ప్రసారమైనప్పటికీ ఖైదీ నంబర్ 150 అతి తక్కువ రేటింగ్ వచ్చింది.
 
మహేష్ నటించిన అట్టర్ ఫ్లాప్ మూవీ బ్రహ్మోత్సవానికి కూడా 7.52 రేటింగ్ వచ్చింది. అంతెందుకు.. నితిన్-సమంత నటించిన అ..ఆ మూవీని నాలుగోసారి వేస్తే 7 టీఆర్పీ వచ్చింది. కానీ చిరు సినిమా ఆ మార్క్ కూడా అందుకోలేకపోయింది. మరోవైపు శర్వానంద్ నటించిన శతమానంభవతి సినిమాకు బుల్లితెరపై 20 టీఆర్పీ వచ్చిన విషయం తెలిసిందే. 

Show comments