బన్నీకి పీకే సెగ కాస్త తగ్గిందా.?

అల్లు అర్జున్‌ అభిమానులకీ, పవన్‌కళ్యాణ్‌ అభిమానులకీ మధ్య కోల్డ్‌ వార్‌ జరుగుతోన్న విషయం విదితమే. సోషల్‌ మీడియా వేదికగా జరుగుతున్న ఈ 'యుద్ధం' సిల్లీగానే వున్నాసరే, అభిమానులకి మాత్రం అలాంటి 'సెన్స్‌' ఏమాత్రం కన్పించడంలేదు.

ఈ అభిమానులు వెరీ వెరీ స్పెషల్‌. ఎందుకంటే, అభిమానులంతా ఇదే తరహాలో 'సిల్లీ'గా వ్యవహరిస్తారని అనుకోలేం. సోకాల్డ్‌ అభిమానులు మాత్రం, సోషల్‌ మీడియా వేదికగా రెచ్చిపోతున్నారంతే. 

'డీజే - దువ్వాడ జగన్నాథమ్‌' టీజర్‌కీ, తొలి సాంగ్‌కి సంబంధించిన ఆడియో సింగిల్‌కీ బీభత్సంగా 'డిజ్‌లైక్స్‌' కొట్టేశారు అల్లు అర్జున్‌ యాంటీ ఫ్యాన్స్‌ (వీళ్ళని పూర్తిగా పవన్‌కళ్యాణ్‌ అభిమానులనేయలేం.. అందులో కొందరు మాత్రమే). అయితే, తాజా ఆడియో సింగిల్‌ విషయంలో మాత్రం ఆ యాంటీ ఫాన్స్‌ 'సెగ' కొంత తగ్గినట్లే కన్పిస్తోంది.

అలాగని, పూర్తిగా లేదనలేం. తమ ఉనికిని అయితే ఆ యాంటీ ఫ్యాన్స్‌ చాటుకున్నారు. సోషల్‌ మీడియా వేదికగా నెగెటివ్‌ కామెంట్స్‌తో విరుచుకుపడుతున్నారు కూడా.! 

ఏమాటకామాటే చెప్పుకోవాలంటే 'డీజే - దువ్వాడ జగన్నాథమ్‌' లేటెస్ట్‌ సాంగ్‌ టీజర్‌ మాత్రం అదిరిపోయింది. సర్‌ప్రైజింగ్‌.. అంటూ రిలీజ్‌ చేసిన ఈ సాంగ్‌ టీజర్‌లో అల్లు అర్జున్‌ స్టెప్స్‌ చాలా స్టైలిష్‌గా వున్నాయి. అల్లు అర్జున్‌, పూజా హెగ్దే కాంబినేషన్‌, ఇద్దరి మధ్యా సాంగ్‌లో కెమిస్ట్రీ బాగా వర్కవుట్‌ అయ్యాయి. హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ 'డిజె' చిత్రాన్ని దిల్‌ రాజు నిర్మిస్తున్నారు.

Show comments