రవితేజ, నాని సినిమాల రిలీజ్ డేట్ ఫిక్స్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాజా ది గ్రేట్ సినిమా చేస్తున్నాడు రవితేజ. అటు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయ్) సినిమా చేస్తున్నాడు నాని. తాజాగా ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ ఫిక్స్ అయ్యాయి. రాజా ది గ్రేట్ సినిమా అక్టోబర్ 11న, డిసెంబర్ 28న ఎంసీఏ సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి.

టచ్ చేసి చూడు, రాజా ది గ్రేట్ సినిమాల్ని సైమల్టేనియస్ గా పూర్తిచేస్తున్నాడు రవితేజ. వీటిలో విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో చేస్తున్న టచ్ చేసి చూడు సినిమాకు ఇంకా విడుదల తేదీ ఫిక్స్ చేయలేదు. కాకపోతే రాజా ది గ్రేట్ మూవీ కంటే ముందే ఇది థియేటర్లలోకి వచ్చే అవకాశముంది.

మరోవైపు నిన్ను కోరి సక్సెస్ తో పండగ చేసుకుంటున్న నాని, ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా ఎంసీఏను థియేటర్లలోకి తీసుకురావాలని ఫిక్స్ అయ్యాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను 30శాతానికి పైగా పూర్తిచేశాడు. గ్యాప్ లేకుండా మిగతా భాగం కూడా పూర్తిచేసి, డిసెంబర్ 28న థియేటర్లలోకి రావాలని ఫిక్స్ అయ్యాడు. ఈ ఏడాది నాని నుంచి వస్తున్న మూడో సినిమా ఇది.

Show comments