అదుర్స్ 2లో అల్లు అర్జున్

కొన్ని కొన్ని కథలు భలేగా పుడతాయి. అదుర్స్ సినిమా కథ సూపర్ ఫన్ అండ్ ఎంటర్ టైన్ మెంట్. ఈ కథలో బ్రాహ్మిన్ కుర్రాడిగా ఎన్టీఆర్ మాంచి మార్కులు కొట్టేసాడు. సినిమా వివి వినాయక్ దే అయినా ఆ క్యారెక్టర్ సృష్టి కర్త డైరక్టర్ హరీష్ శంకర్. అప్పట్లో ఆయన ఆ రైటర్ల ట్రూప్ లో వుండేవారు. అప్పట్లో  ఆయన రెండు బ్రాహ్మిన్ క్యారెక్టర్లను తయారు చేసారు. అందులో ఒకటి అదుర్స్ లో ఎన్టీఆర్ క్యారెక్టర్. మరొకటి మిరపకాయ్ లో హీరోయిన్ క్యారెక్టర్. రెండూ క్లిక్కయ్యాయి. 

ఆ తరువాత అదుర్స్ లోని క్యారెక్టర్ నే మరి కాస్త పొడిగించి, ఇంకో స్టోరీ తయారు చేసారు. దాన్ని అదుర్స్ 2గా ఎన్టీఆర్ తో చేద్దామని అనుకున్నారు. కుదరలేదు. అదే ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా డిజె (దువ్వాడ జగన్నాధమ్) కథ అని తెలుస్తోంది. ఈ వివరాలు ఎక్స్ క్లూజివ్ గా మీ కోసం. అయితే ఈ కథను అరవింద్, బన్నీ కలిసి గత ఏడాది కాలంగా, ఫిల్టర్ చేసి, మార్పులు చేసి, మొత్తం రూపురేఖలు మార్పించారని వినికిడి. 

అయితే బన్నీ క్యారెక్టర్ మాత్రం సినిమాలో బ్రాహ్మిన్ క్యారెక్టర్ అని, అదే యాస, భాష వుంటాయని తెలుస్తోంది. అందుకే దువ్వాడ జగన్నాధమ్ అనే పేరు పెట్టారట. అయితే దువ్వాడ అన్నది బ్రాహ్మిన్స్ ఇంటి పేరు కాదనుకోండి. అయినా అదంతా వేరే సంగతి. మొత్తానికి బన్నీ ఓ డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడన్నమాట. గతంలో చిరంజీవి కూడా ఓ సినిమాలో బ్రాహ్మిన్, యాస, భాష క్యారెక్టర్ చేసారు. 

Show comments