ప్రభాస్ సాహో ఫస్ట్ లుక్ రిలీజ్ రద్దు

ప్రభాస్ ఫ్యాన్స్ కేవలం బాహుబలి-2 మూవీ కోసం మాత్రమే వెయిట్ చేయట్లేదు. ఆ మూవీ ఇంటర్వెల్ టైమ్ లో వచ్చే సాహో సినిమా టీజర్ కోసం కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ నెక్ట్స్ మూవీ సాహో ఫస్ట్ లుక్ ఈ ఆదివారం గ్రాండ్ గా రిలీజ్ అవుతుందని, ఇక 28వ తేదీన బాహుబలి-2 సినిమాతో పాటు టీజర్ ప్రసారం అవుతుందని అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే ఫర్ ఎ ఛేంజ్..  ఈ ఆదివారం ప్రభాస్ సందడి చేయట్లేదు. సాహో సినిమా ఫస్ట్ లుక్ విడుదల కావట్లేదు.

తాజా సమాచారం ప్రకారం.. సాహో ఫస్ట్ లుక్ లాంచ్ ను క్యాన్సిల్ చేశారు. డైరక్ట్ గా బాహుబలి-2 సినిమా విడుదల సమయంలో టీజర్ ను లాంచ్ చేయాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. బాహుబలి - ది కంక్లూజన్ సినిమా ఇంటర్వెల్ టైమ్ లో సాహో టీజర్ వస్తుంది. ప్రస్తుతానికి ఇది అఫీషియల్. ముందుగానే ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తే.. టీజర్ పై అంచనాలు తగ్గిపోతాయనే అనుమానంతో ఫస్ట్ లుక్ లాంచ్ ను రద్దుచేసినట్టు తెలుస్తోంది.

సుజీత్ దర్శకత్వంలో సుమారు 150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో సాహో సినిమాను ప్లాన్ చేశారు. ప్రభాస్ కు జాతీయస్థాయిలో వచ్చిన గుర్తింపును దృష్టిలో పెట్టుకొని, సాహో టీజర్ ను తెలుగు-తమిళ-మలయాళ-హిందీ భాషల్లో రూపొందించారు. సినిమాను కూడా 4 భాషల్లో ఒకేసారి విడుదల చేయాలనేది యూవీ క్రియేషన్స్ ప్లాన్.

Readmore!
Show comments