కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ తీసుకుని మీడియాలో నానడం, సబ్జెక్ట్‌పై ఆసక్తి ఉన్న వారిని థియేటర్ల వైపు పరుగులు పెట్టించడం రామ్‌గోపాల్‌వర్మ లేటెస్ట్ టెక్నిక్. 'వంగవీటి' సినిమా చూస్తే వర్మకి అసలు విజయవాడ సంగతులేమీ లోతుగా తెలీవని, తెలిసినా ఉన్నది ఉన్నట్టు తీసే ధైర్యం లేదని తేలిపోయింది.
ప్రస్తుతం వీక్‌గా ఉన్న కుటుంబాన్ని టార్గెట్ చేసి, అవతలి వర్గాన్ని గ్లోరిఫై చేసి వర్మ చీవాట్లు తింటున్నాడు. సబ్జెక్ట్ మీద ఉన్న క్యూరియాసిటీ వల్ల కోస్టల్ బెల్ట్‌లో వంగవీటి చిత్రానికి ఓపెనింగ్స్ అయితే బ్రహ్మాండంగా వచ్చాయి. కానీ సినిమాలో మేటర్ లేకపోవడంతో ఆ తర్వాత ఈ చిత్రం నిలబడలేకపోయింది.
ఇకపై అన్నీ మంచి చిత్రాలే తీస్తానంటూ గప్పాలు పలికిన రామ్‌గోపాల్‌వర్మ ఈ చిత్రంతోను గాలి తీసేయడంతో ఇక అతడి మాటలని సీరియస్‌గా తీసుకునేదెవరో చూడాలి. నిజానికి వర్మ మంచి సబ్జెక్టులని రైట్ టైమ్‌లో ఎంచుకుంటున్నాడు. కానీ వాటిని క్లిక్ చేయడంలో విఫలం అవుతున్నాడు. కాస్త సమయం వెచ్చించి, మునుపటి మాదిరిగా క్వాలిటీ సినిమాలు తీసినట్టయితే వర్మ ఇప్పటికీ సంచలనాలు సృష్టిస్తుండేవాడు. క్వాలిటీ టీమ్ కాకుండా లో బడ్జెట్ టెక్నికల్ క్రూ ఉండడం వల్ల వర్మ సినిమాల్లో స్టఫ్ ఉండట్లేదని విమర్శకులు అంటున్నారు.