ఈ వీక్‌ ట్రేడ్‌ టాక్‌

జనతా గ్యారేజ్‌ చిత్రానికి టాక్‌ అనుకూలంగా రాకపోయినా కానీ ఒక పెద్ద సినిమా చూడాలని ఆవురావురుమంటోన్న ప్రేక్షకుల ముందుకి కరక్ట్‌ టైమ్‌లో వచ్చింది. చాలా కాలంగా భారీ సినిమాలన్నీ నిరాశ పరుస్తూ రావడంతో ఇది యావరేజ్‌గా ఉందన్నా కానీ చూడ్డానికి జనం బారులు తీరారు. దీంతో జనతా గ్యారేజ్‌కి తొలి వారంలోనే అరవై కోట్ల షేర్‌ వచ్చిందని అంటున్నారు.

బాహుబలి తర్వాత మొదటి వారంలో ఇంత షేర్‌ వచ్చిన సినిమా ఇదేనని నిర్మాతలు చెబుతున్నారు. కలక్షన్ల లెక్కల్లో కాస్త తేడాలు ఉండవచ్చు కానీ జనతా గ్యారేజ్‌ మొదటి వారంలో అదరగొట్టింది మాత్రం వాస్తవం. ఎన్టీఆర్‌ సినిమా ఇంత ఘనంగా ఆడి చాలా కాలమవుతోంది. ఈ నెలాఖరు వరకు దీనికి పోటీనిచ్చే సినిమాలేవీ లేవు కనుక నెమ్మదిగా ఈ చిత్రం టాప్‌ 3లో చోటు దక్కించుకుంటుందని ట్రేడ్‌ వర్గాలు భావిస్తున్నాయి.

మార్కెట్లో ఇది తప్ప మరో సినిమా లేకపోవడంతో గత వారం ప్రేక్షకులకి జనతా గ్యారేజ్‌ తప్ప మరో ఆప్షన్‌ లేకపోయింది. ఈవారం ఇంకొక్కడు, జ్యో అచ్యుతానంద వచ్చాయి కానీ వీటికి జనతా గ్యారేజ్‌కి పోటీనిచ్చేంత రేంజ్‌ అయితే ఖచ్చితంగా లేదు. 

Readmore!
Show comments