సునీల్-సప్తగిరి-వెన్నెలకిషోర్

సరైన కమెడియన్ కు సరైన సినిమాలు పడితే దూసుకుపోతారు. సునీల్, సప్తగిరి అలాగే దూసుకు వచ్చారు. సునీల్, బ్రహ్మానందం, ఎమ్మెస్ ల ప్లేసును సప్తగిరి రీప్లేస్ చేస్తాడు అనుకుంటే హీరోయిజం వైపు వెళ్లిపోయాడు. కామెడీ వేషాలు వేస్తున్నా కూడా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్లు సప్తగిరికి పడడం లేదు. కారణం ఏమిటో అతగాడికే తెలియాలి. 

ఇలాంటి టైమ్ లో వెన్నెల కిషోర్ అందుకున్నాడు. పైగా తాను హీరో వేషాలు వేసేది లేదు అని డైరక్ట్ గానో, ఇన్ డైరక్ట్ గానో కన్వే చేస్తున్నాడు. దీంతో అతనికి ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్లు పడుతున్నాయి. ఎక్కడికిపోతావు చిన్నవాడా, కేశవ, లేటెస్ట్ గా రారండోయ్ సినిమాలు వెన్నెల కిషోర్ ను మరింత ఎలివేట్ చేసాయి. రాబోయే అమీతుమీలో కూడా మంచి క్యారెక్టరే. 

ఈలెక్కన చూస్తుంటే టాలీవుడ్ లో సరైన లీడ్ కమెడియన్ లేని కొరతను వెన్నెల కిషోర్ తీర్చేటట్లే కనిపిస్తున్నాడు. నిజానికి ఇది సునీల్ కు సరైన సమయం. హీరో వేషాల సంగతి అలా వుంచి, మళ్లీ లీడ్ కమెడియన్ గా రావడానికి ఇదే సరైన అదను. ఇండస్ట్రీ జనం ఏమనుకుంటారు అన్నది కాకుండా, తన కెరీర్ తనకు ముఖ్యం అనుకుంటే, రంగంలోకి దిగిపోవడమే. ఆదరించడానికి సునీల్ కామెడీ అంటే పడిచచ్చే ఆడియన్స్ అనేకమంది వున్నారు. లేదూ అంటే వెన్నెల కిషోర్ ఈ జనరేషన్ కామెడీ కింగ్ కావడం అన్నది ఫిక్స్ గానే కనిపిస్తోంది.

Show comments