డిసెంబర్ 23న కోటీశ్వరుడు

మీలో ఎవరు కోటీశ్వరుడు అంటూ ఇటు నవీన్ చంద్ర, అటు పృధ్వీ రెడీ అయిపోయారు. అంతా రెడీ. సినిమా విడుదల అనేసరికి పెద్ద నోట్ల రద్దు వచ్చి పడింది. దాంతో మొత్తం సినిమా రంగం సీన్ మారిపోయింది. ఇప్పుడిప్పుడే కుదుట పడుతోంది. దీంతో సినిమాల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

ఇంట్లోదెయ్యం నాకేం భయ్యం, మీలో ఎవరు కోటీశ్వరుడు, జయమ్ము నిశ్చయమ్మురా, ఒక్కడొచ్చాడు, రెమో, సప్తగిరి ఎక్స్ ప్రెస్, మన్యంపులి, ధృవ, సింగం 3, నేను లోకల్, భేతాళుడు, ఇలా డజనుకు పైగా సినిమాలు వున్నాయి లైన్లో. ఇయర్ లో మిగిలినవి అయిదు వారాలు. వీటిలో ధృవ, సింగం 3 లాంటివి సోలోగా రెండు వారాలు బుక్ చేసేసుకుంటాయి. మిగిలిన మూడు వారాలను పది సినిమాలు సర్దుకోవాలి.

ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో మీలో ఎవరు కోటీశ్వరుడు సినిమాను వచ్చేనెల 23న విడుదలకు డిసైడ్ అయ్యారు. ఆ రోజు ప్రస్తుతానికైతే మరో సినిమా లేదు. నాని నేనులోకల్ విడుదల వుంటే వుండొచ్చు. 

Show comments