ఆ డైరక్టర్ తో పవన్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు ఫిక్సయి రెడీగా వున్నాయి. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో, మరొకటి తమిళ్ డైరక్టర్ తో. ఇవి కాక కొరటాల శివ కాంబినేష్ సెట్ చేయాలన్న ప్రయత్నమూ వుండనే వుంది. అయితే ఇప్పుడు పవన్ తో మరో డైరక్టర్ కాంబినేషన్ సెట్ చేయాలన్న ప్రయత్నమూ ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవికి మరుపురాని హిట్ ఇచ్చిన వివి వినాయక్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా సెట్ చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు వినికిడి. వినాయక్ కు జోడీ అయిన కథకుడు, రచయిత ఆకుల శివ ప్రస్తుతం కాటమరాయుడుకు పనిచేసారు. ఆయనే వినాయక్-పవన్ సినిమాకు కథ తయారుచేసే పనిలో వున్నట్లు తెలుస్తోంది. ఖైదీ 150 తరువాత వినాయక్ ఇంకా ఏ సినిమా స్టార్ట్ చేయలేదు. మహేష్ తో ఓ సినిమా చేయాల్సి వుంది. అది ఎప్పటి నుంచో అలా వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పట్లో అది మెటీరియలైజ్ కూడా కాదు. ఇక ఎన్టీఆర్ తో ఓ సినిమా అనుకున్నారు. అందువల్ల అయితే పవన్ లేదా ఎన్టీఆర్ సినిమానే వినాయక్ తరువాతి సినిమా అవుతుంది.

పవన్ –ఎఎమ్ రత్నం సినిమా కనుక ఏ కారణాల వల్ల అయినా వెనక్కు వెళితే, కచ్చితంగా పవన్-వినాయక్ సినిమా వుంటుందని తెలుస్తోంది.

Readmore!
Show comments

Related Stories :