టీజర్ వచ్చింది.. మళ్లీ లొల్లి షురూ అయింది

బన్నీ నటిస్తున్న డీజే ఆడియో రిలీజ్ టీజర్ వచ్చింది. ఇలా యూట్యూబ్ లో విడుదలవ్వడమే ఆలస్యం.. అలా బన్నీ-పీకే అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్ మొదలైంది. ట్విట్టర్, ఫేస్ బుక్, యూట్యూబ్ అనే తేడాలేకుండా అల్లు అర్జున్, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కీచులాడుకుంటున్నారు.

డీజే ఆడియో రిలీజ్ టీజర్ విడుదలై ఇంకా 24 గంటలైనా కాలేదు. అప్పుడే పవన్ ఫ్యాన్స్ తమ ప్రతాపం చూపించారు. ఫస్ట్ లుక్ టీజర్ ను డిస్ లైక్స్ తో ముంచెత్తినట్టే.. ఆడియో రిలీజ్ టీజర్ పై కూడా తమ వ్యతిరేకత చూపిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ టీజర్ కు యూట్యూబ్ లో 16వేల లైక్స్ ఉంటే.. డిస్ లైక్స్ 10వేలకు పైనే.

డీజే సినిమాకు సంబంధించి ఇంకా చాలా హంగామా మిగిలే ఉంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రయిలర్ ఇంకా రావాల్సి ఉంది. పాటలు కూడా ఆన్ లైన్లో ఒక్కొక్కటిగా రిలీజ్ కావాలి. సో.. ఇంకొన్ని రోజుల పాటు దువ్వాడకు ఈ డిస్ లైక్ ల గోల తప్పకపోవచ్చు.

Show comments